45 ఏళ్ల డేటాతో ఎఫ్‌టీఎల్‌ లెక్క

Published on Tue, 10/08/2024 - 06:27

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో చెరువులకు సంబంధించిన పూర్తిస్థాయి నీటి నిల్వమట్టం (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ –ఎఫ్‌టీఎల్‌)ను గుర్తించడంతోపాటు గరిష్టంగా జలాలు విస్తరించే ప్రాంతం (మాగ్జిమమ్‌ వాటర్‌ స్ప్రెడ్‌ ఏరియా– ఎండబ్ల్యూఎస్‌ఏ)ను తేల్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ‘లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ (ఎల్‌పీసీ)’శాస్త్రీయ విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమైంది. ఎల్‌పీసీ చైర్మన్‌గా ఉన్న హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో దీనిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నీటిపారుదల, రెవెన్యూ, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్, సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల ఎన్ని చెరువులు ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని రంగనాథ్‌ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆయా చెరువులకు గతంలో నిర్ధారించిన ఎఫ్‌టీఎల్‌ పక్కాగా లేకున్నా, సహేతుకమైన అభ్యంతరాలు వ్యక్తమైనా.. సమీక్షించి, సవరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై 2018లో కాగ్‌ ఇచి్చన నివేదికను పరిశీలించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు రంగనాథ్‌ స్పష్టం చేశారు. 

45 ఏళ్ల లెక్కలను తీసుకుని.. 
ఇక చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, వాటర్‌ స్ప్రెడ్‌ ఏరియాను గుర్తించడానికి 45 ఏళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 1979 నుంచి ఆయా జల వనరులకు సంబంధించిన విలేజ్‌ మ్యాప్స్, భూ వినియోగం సర్వే నంబర్లతో సహా సమాచారం ఇచ్చే కాడాస్ట్రల్‌ మ్యాప్‌లను క్రోడీకరించి ఖరారు చేయనున్నారు. హిమాయత్‌సాగర్‌లో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్ల గుర్తింపుతో ఈ విధానం ప్రారంభించి మిగతా వాటికీ వర్తింపజేయనున్నారు. 

గట్టి నిఘా పెట్టేలా చర్యలు 
చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుంది. ఆయా ప్రాంతాలను జియో ఫెన్సింగ్, ట్యాగింగ్‌ చేయడంతోపాటు ప్రత్యేక యాప్‌ను వినియోగంలోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఎక్కడ, ఎలాంటి ఆక్రమణలు జరుగుతున్నా తక్షణమే ఆ సమాచారం హైడ్రాకు చేరేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాప్‌ ద్వారానే ప్రజలు సమాచారం తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదు చేయడానికీ ఆస్కారం ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులు చేపట్టే పరిశీలనలు, వాటి ఫలితాలతోపాటు తీసుకున్న చర్యలను ఇందులో నమోదు చేస్తారు.

ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడమే కాకుండా, పూర్వవైభవం తీసుకురావడంపైనా హైడ్రా అధికారులు దృష్టి పెడుతున్నారు. కూలి్చవేతలకు సంబంధించిన వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో ఈ పనులు ప్రారంభించాలని కమిషనర్‌ రంగనాథ్‌ నిర్ణయించారు. చెరువుల పరిరక్షణ కోసం ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు