Breaking News

మేయరా...అయితే మాకేంటి?

Published on Tue, 10/08/2024 - 05:58

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై విజయవాడ నగ ర మేయర్‌కు సోమవా రం ఘోర అవమానం ఎదురైంది. కొండపై ఆమెను అడుగడుగునా అధికారులు అవమానించారు. ఆమె కారు ను పదేపదే నిలిపివేశారు. ఆమె కారులోంచి బయటకు వచ్చి తాను మేయర్‌ని అని, తనకు ప్రొటోకాల్‌ ఉంటుందని చెబుతున్నా ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కష్టాలుపడి కొండపైకి చేరుకున్న ఆమెను ఆలయ చిన్న రాజగోపురం వద్ద పోలీసులు, దేవస్థానం సిబ్బంది నిలిపివేశారు.

దీంతో ఆమె కొద్దిసేపు పక్కనే నిలబడి ఎదురు చూశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న మీడియా ఆమె వద్దకు వచ్చి వీడియో తీస్తుండగా అప్పటికప్పుడు సిబ్బంది స్పందించి గేట్‌ తీసి ఆమెను లోపలకు పంపించారు. రూ.300 క్యూ లైన్‌ నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకొని మేయర్‌ బయటకు వచ్చేశారు. సాధారణంగా మేయర్‌ వచ్చినప్పుడు ఆమెకు ప్రొటోకాల్‌ అధి కారులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వాదాలను, ప్రసాదాలను అందించి పంపాల్సి ఉంటుంది.

బీసీ మహిళను అవమానించారు 
‘అమ్మవారి దర్శనానికి వస్తే నన్ను అవమానించారు. దేవస్థానం చెప్పిన సమయంలోనే నేను కొండపైకి వచ్చాను.నాకు వెహికల్‌ పాస్‌ ఇవ్వమని కలెక్టర్, సీపీ, నగర కమిషనర్‌ను కోరాను. మీరు మేయర్‌.. మిమ్మల్ని ఎవరు ఆపుతారని అధికారులు అన్నారు. కానీ నాకు అడుగడుగునా అడ్డంకులే. నేను మేయర్‌ని అని అందరికీ చెప్పుకోవాలి్సన పరిస్థితి కల్పించారు. పోలీసులు, దేవస్థానం అధికారుల తీరు సరిగాలేదు. గతంలో ఏనాడైనా ఇలా జరిగిందా..? కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. నగర పాలకసంస్థ సహకారం లేకుండా భవానీదీక్షలు, దసరా ఉత్సవాలను నిర్వహించగలరా?  మేయర్‌ను అందులోనూ  బీసీ వర్గానికి చెందిన మహిళను కావాలనే నన్ను అవమానించారు. –రాయన భాగ్యలక్ష్మి, మేయర్‌ విజయవాడ 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)