Breaking News

‘అక్షయపాత్ర’ రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమయ్యాయి?

Published on Tue, 10/08/2024 - 05:28

సాక్షి, అమరావతి: వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్‌ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో రూ.534 కోట్లను కూటమి నేతలు దోచేశారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా రూ.1.39 కోట్లు,మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. ఏ కాంట్రాక్టర్‌ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో  ప్రభుత్వంవివరాలు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? 
ప్రభుత్వం నిజంగా  బాధితులకు సాయం చేసి ఉంటే.. ఇప్పుడు కలెక్టరేట్‌ వద్దకు వేలా దిమంది ఎందుకు పోటెత్తుతున్నా రని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలన్నారు. ఆహా­రం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయో­గించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లి­ంచినట్లు చెబుతున్నారని, నిజానికి అప్పు­డు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.534 కోట్ల­కు సరైన లెక్కలు చెప్పే వరకు ఊరుకోబోమ­ని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటి­ంచారు.

Videos

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)