Breaking News

గ్రాఫిక్స్‌కి సమయం ఇవ్వలేదు!

Published on Tue, 10/08/2024 - 00:07

హీరో రజనీకాంత్, డైరెక్టర్‌ కేఎస్‌ రవికుమార్‌లది హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ముత్తు’(1995) చిత్రం సూపర్‌ హిట్‌ కాగా, ‘నరసింహా’(1999) మూవీ బ్లాక్‌బస్టర్‌ అయింది. అయితే వీరికాంబోలో వచ్చిన ‘లింగ’(2014) చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కాగా ఈ సినిమా ఎడిటింగ్‌ విషయంలో రజనీకాంత్‌ జోక్యం చేసుకున్నారంటూ కేఎస్‌ రవికుమార్‌ తాజాగా ఆరోపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేఎస్‌ రవికుమార్‌ మాట్లాడుతూ–‘‘లింగ’ సినిమా ఎడిటింగ్‌ విషయంలో రజనీకాంత్‌ జోక్యం చేసుకున్నారు. ద్వితీయార్ధం మొత్తం మార్చేశారు.

కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌కి నాకు సమయం ఇవ్వలేదు. అనుష్కతో ఉండే ఒక పాటని, పతాక సన్నివేశంలో వచ్చే ఓ ట్విస్ట్‌ను పూర్తిగా తొలగించారు. కృత్రిమంగా ఉండే బెలూన్  జంపింగ్‌ సీన్ ని యాడ్‌ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా మొత్తాన్ని గందరగోళం చేశారు’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్‌పై కేఎస్‌ రవికుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

అయితే ‘లింగ’ సినిమా గురించి 2016లో కేఎస్‌ రవికుమార్‌ మాట్లాడిన మాటలను కొందరు గుర్తు చేస్తున్నారు.  ‘‘ప్రపంచవ్యాప్తంగా మా సినిమా(లింగ) రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అది మామూలు విషయం కాదు. బాక్సాఫీస్‌ వసూళ్ల పరంగా మా సినిమా సూపర్‌హిట్‌’’ అంటూ గతంలో మాట్లాడిన ఆయన.. ఇప్పుడేమో ‘లింగ’ పరాజయానికి రజనీకాంత్‌ కారణమని చెబుతున్నారంటూ విమర్శిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)