Breaking News

కోల్‌కతా అభయ కేసు : సందీప్‌ ఘోష్‌ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసిన ఐఎంఏ

Published on Wed, 08/28/2024 - 19:57

న్యూఢిల్లీ: కోల్‌కతా అభయ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సస్పెండ్‌ చేసింది.

ఆర్‌జీకార్‌ అభయపై జరిగిన దారుణంలో సందీప్‌ ఘోష్‌ ప్రమేయం ఉందని తేలలేదు. అయినప్పటికీ ఘటన జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం, ఆత్మహత్య అని బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై సీబీఐ సైతం దర్యాప్తు చేస్తుంది.  

అదే సమయంలో ఆర్‌జీకార్‌ మాజీ డాక్టర్‌, ప్రస్తుత ముర్షిదాబాద్‌ వైద్య కళాశాల డిప్యూటీ సుపరింటెండెంట్‌ అక్తర్‌ అలీ సందీప్‌ ఘోష్‌పై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. మృతదేహాలతో వ్యాపారం,బయోమెడికల్ వ్యర్థాలను అక్రమంగా రవాణా చేశారని ఆరోపించారు.

ఈ ఆరోపణలతో సీబీఐ అధికారులు సందీప్‌ ఘోష్‌ను 90 గంటల పాటు ప్రశ్నించారు. దీంతో పాటు ఆయన ఇల్లు, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం 11 గంటల పాటు సోదాలు జరిపారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేశారు.

ఈ తరుణంలో ఐఎంఏ సందీప్‌ ఘోష్‌ సభ్యత్వాన్ని ఐఎంఏ సస్పెండ్‌ చేసింది. వైద్యురాలి మరణంతో పాటు ఆమె కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యం, సానుభూతి లేకపోవడాన్ని ప్రస్తావించింది. తన తీరుతో సందీప్‌ ఘోష్‌ వైద్యవృత్తికి చెడ్డపేరు తెచ్చారని, క్రమశిక్షణా కమిటీ అతనిని సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని ఐఎంఏ తెలిపింది. 

కాగా,ఆర్‌జీ కార్‌ ఆస్పత్రి వైద్యురాలి మరణం అనంతరం జరిగిన పరిణామలపై సందీప్‌ ఘోష్‌ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కొన్ని గంటల్లోనే మమతా ప్రభుత్వం అతన్ని కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమించడం విశేషం.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)