Breaking News

2019లో ప్రధాని మోదీకి ఎదురు నిలిచి..

Published on Tue, 05/14/2024 - 09:47

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. 2014లో తొలిసారిగా నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి ప్రధాని అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఈ స్థానం నుంచి 25 మంది అభ్యర్థులతో తలపడ్డారు.

నాడు ప్రధాని మోదీతో పోటీపడిన 25 మంది అభ్యర్థుల్లో 22 మంది డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇద్దరు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. నాడు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌కు ఒక లక్షా 95 వేల 159 ఓట్లు రాగా, మొత్తం ఓట్లలో ఇవి 18.40 శాతం. మూడో స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన అజయ్‌రాయ్‌కు 14.38శాతం ఓట్లు వచ్చాయి. గత లోక్ సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ ఖాతాలో లక్షా 52 వేల 548 ఓట్లు పడ్డాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ వారణాసి నుంచి 4 లక్షల 79 వేల 505 ఓట్లతో విజయం సాధించారు. 2014లో తొలిసారిగా వారణాసి స్థానం నుంచి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాడు కాంగ్రెస్‌ తరఫున అజయ్‌రాయ్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి కైలాష్‌ చౌరాసియా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అజయ్ రాయ్‌కు 75 వేల 614 ఓట్లు రాగా, కైలాష్ చౌరాసియాకు 45 వేల 291 ఓట్లు వచ్చాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన విజయ్‌ ప్రకాశ్‌ జైస్వాల్‌కు 60 వేల 579 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచి రెండు లక్షల, తొమ్మిది వేల 238 ఓట్లు దక్కించుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి నరేంద్ర మోదీకి  ఐదు లక్షల ఒక వేయి 22 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 56.37 శాతం. నాడు మోదీ మూడు లక్షల 71 వేల 784 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

నరేంద్ర మోదీ వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రధాని మోదీ గత విజయాలను అధిగమిస్తారని బీజేపీ చెబుతోంది. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తున్నాయి. వారణాసి స్థానం నుంచి కాంగ్రెస్‌ మరోసారి అజయ్‌ రాయ్‌కు అవకాశం కల్పించగా, ఆయనకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతుగా నిలుస్తోంది.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)