Breaking News

గేమింగ్‌ వరల్డ్‌కు.. పురాణ సౌరభం నింపిన ‘చిత్తం!’

Published on Tue, 05/14/2024 - 08:53

చెన్నైకి చెందిన చరణ్య కుమార్‌కు గేమింగ్‌ అంటే ఎంతో ఇష్టమో, పురాణాలు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే పురాణాలలోని ఆసక్తికర అంశాలను, స్ఫూర్తిదాయకమైన విషయాలను గేమింగ్‌లోకి తీసుకువచ్చింది  చరణ్య కుమార్‌. ఆమెప్రారంభించిన ‘చిత్తం’ గేమింగ్‌ కంపెనీ విజయపథంలో దూసుకుపోతోంది...

యూఎస్‌లో ఇంజినీరింగ్‌ చేసిన చరణ్య కుమార్‌ ఎన్నో పెద్ద కంపెనీలలో కన్సల్టింగ్‌ విభాగంలో పనిచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యల వల్ల పురాణాలకు దగ్గరైంది. వాటిని చదవడం తనకు ఎంతో సాంత్వనగా ఉండేది. అమ్మమ్మ ద్వారా పురాణాలలోని గొప్పదనం గురించి చిన్న వయసులోనే విన్నది కుమార్‌.

‘జీవితంలో ప్రతి సమస్యకు పురాణాల్లో సమాధానం దొరుకుతుంది’ అంటుంది కుమార్‌. ఉద్యోగం నుంచి బ్రేక్‌ తీసుకున్న కుమార్‌ ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘పురాణాలు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైనవి కాదు. పౌరాణిక విషయాలు నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా దారి చూపుతాయి. కష్టకాలంలో పురాణ పఠనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు సొంతంగా ఏదైనాప్రారంభించాలనే పట్టుదలను కూడా ఇచ్చింది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు ఎంబీఏ చేయడం’ అంటున్న కుమార్‌ గేమింగ్‌ కంపెనీ ‘చిత్తం’ రూపంలో తన కలను నెరవేర్చుకుంది.

తక్కువప్రాడక్ట్‌లతో మొదలైన ‘చిత్తం’ మొదటి సంవత్సరంలోనే పదమూడుప్రాడక్ట్స్‌కు చేరుకుంది. ‘ఫన్‌’ ఎలిమెంట్స్‌ను జత చేస్తూ ‘చిత్తం’ రూపొందించిన గేమ్స్, యాక్టివిటీస్, బుక్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యాయి. తమిళ సామెతలను దృష్టిలో పెట్టుకొని ‘పార్టీ టాక్స్‌’ అనే గేమ్‌ను డిజైన్‌ చేశారు. ‘భరత విలాస్‌’ అనేది చిత్తం బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ఈ కార్డ్‌ గేమ్‌ మన సంస్కృతిలోని రకరకాల నృత్యరూపాలు, వంటల రుచులు... మొదలైన వాటిని వెలికితీస్తుంది.

‘సింపుల్‌ గేమ్‌ ప్లే–సింపుల్‌ కంటెంట్‌ అనే రూల్‌ని నమ్ముకొని ప్రయాణంప్రారంభించాం. మా నమ్మకం వృథా పోలేదు’ అంటుంది చరణ్య. వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో ఫండింగ్‌ విషయంలో కాస్తో కూస్తో ఇబ్బంది పడినా ఆ తరువాత మాత్రం తనదైన ప్రత్యేకతతో ఇన్వెస్టర్‌లను ఆకర్షించి విజయపథంలో దూసుకుపోతోంది ‘చిత్తం’.

ఇవి చదవండి: కాన్స్‌లో ఆ ముగ్గురు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)