కలర్ ఫుల్ బ్యూటీస్
Breaking News
'చంద్రబాబుకు ధీటుగా లాబీయింగ్ చేస్తా'
Published on Tue, 06/03/2014 - 14:31
హైదరాబాద్ : బీజేపీ అగ్ర నేతలతో తనకున్న పరిచయాలతో తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు తీసుకు వస్తానని మహబూబ్నగర్ టీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ లోక్ సభ నేత జితేందర్ రెడ్డి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధీటుగా లాబీయింగ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ మొదటి సమావేశాల్లోనే పోలవరం ఆర్డినెన్స్పై గళం విప్పుతామని జితేందర్ రెడ్డి మంగళవారమిక్కడ స్పష్టం చేశారు.
లోక్సభలో పోలవరం ఆర్డినెన్స్ను అడ్డుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే ఎన్డీయేపై పోరాడతామని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే నరేంద్ర మోడీని తెలంగాణకు ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ఎన్టీయేతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, కేంద్రానికి తాము ప్రతిపక్షం కాదన్నారు.
Tags : 1