PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
జీవిత పయనంలో కష్టమైనదే సరైన దారి: వైఎస్ జగన్
Published on Sat, 12/24/2016 - 12:24

వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని పేదవారందరికీ మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో వెంకటప్ప స్కూలును ఏర్పాటుచేసినట్లు వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పులివెందులలోని వెంకటప్ప స్కూలు పదో వార్షికోత్సవంలో పాల్గొన్నారు. జీవిత ప్రయాణంలో రెండు దారులు కనిపిస్తాయని, వాటిలో ఒకదారి సులభమైనది, మరొకటి కష్టమైనదని చెప్పారు. అయినా కష్టమైనదే కరెక్టయిన దారి అన్నారు. సులభమైన దారి కాపీలు కొట్టడం, సులభంగా పాసయ్యే మార్గాలు, మార్కులు తెచ్చుకునే మార్గాలని.. కానీ ఆదారిలో వెళ్తే తాత్కాలికంగా సాధించగలమేమో గానీ, తర్వాత మాత్రం ఫెయిలవుతామన్నారు.
కష్టమైనది అనిపించే దారిలో కష్టపడి మన జీవితంలో ఈరోజు పడే కష్టాన్ని జీవితంలో రేపు విజయంగా మార్చుకోవచ్చని, అందుకు చదువుతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. చదువు నుంచి జీవితం వరకు ఇలాగే జరుగుతుందన్నారు. జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు. సులభమైన దారిలో పోతే క్యారెక్టర్, క్రెడిబిలిటీ రెండూ పోతాయని.. అదే కొంచెం కష్టపడితే ఈ రెండు రావడంతో పాటు దీర్ఘకాలంలో విజయాలు సాధిస్తారని చెప్పారు.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురువు వెంకటప్ప పేరుతో ఏర్పాటుచేసిన ఈ స్కూల్లో ఎవరి వద్ద నుంచి పైసా ఫీజు కూడా తీసుకోరని, వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తోందని ఆయన చెప్పారు. ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ అభినందనలు చెబుతున్నామన్నారు. ఈ పాఠశాలలలోని విద్యార్థులందరూ బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సాక్షి గ్రూపు ఛైర్‌పర్సన్ భారతీరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



#
Tags : 1