బుడతడి స్పిన్‌కు వార్న్‌ ‘క్లీన్‌బౌల్డ్‌’

Published on Thu, 07/05/2018 - 12:48

కరాచీ: ఏడేళ్ల బుడతడి స్పిన్‌ బౌలింగ్‌కు దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ‘క్లీన్‌బౌల్డ్‌’ అయ్యాడు. దీంతో చిన్నారి బౌలింగ్‌ను మెచ్చిన షేన్ వార్న్ నేరుగా అతడితో మాట్లాడాడు. అంతేకాదు అతడి గురించి షేన్ వార్న్ తన ట్విట్టర్‌లో కూడా పోస్టు చేశాడు.  లారెస్ స్పోర్టింగ్ మూమెంట్‌ రేసులో నిలిచిన ఈ చిన్నారికి ఓటేయాలని  వార్న్  పిలుపునిచ్చాడు.

పాకిస్తాన్‌కు చెందిన ఏడేళ్ల బుడతడి పేరు ఎలి మికల్ ఖాన్. ఏడేళ్ల వయసులోనే లెగ్‌ స్సిన్‌ వేస్తూ వార్న్‌ను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు. ఏదొక రోజు పాకిస్తాన్‌ జాతీయ జట్టుకు ఆడటమే తన లక్ష్యంగా మికల్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. షేన్ వార్న్‌తో మాట్లాడిన సందర్భంలో ఆనందం తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు. అంతేకాదు తనను అందరూ లిటిల్ షేన్ వార్న్ అని పిలవడం ఓ అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు అతను చెప్పాడు.

తాను భవిష్యత్తులో మరో షేన్ వార్న్ కావాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. మరొకవైపు ఆ బాలుడిపై వార్న్‌ సైతం ప్రశంసలు కురిపించాడు. ఏడేళ్ల వయసులోనే ఇలా బౌలింగ్ చేయడం అద్భుతమని వార్న్‌ కొనియాడాడు. ఆ చిన్నారిలో అసాధారణమైన టాలెంట్‌ ఉందని కితాబిచ్చాడు. అతనికి ఓటేసి గెలిపించాలని కోరాడు.

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)