Breaking News

షేమ్‌ షేమ్‌ షమీ! 

Published on Thu, 03/08/2018 - 01:41

కోల్‌కతా: భారత క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. తనను తీవ్రంగా హింసిస్తున్నాడని, ఇతర మహిళలతో సంబంధాలు కూడా పెట్టుకున్నాడని అతని భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపించింది. గత రెండేళ్లుగా దీనిని భరిస్తూ వచ్చిన తాను, తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ బయట పెట్టాల్సి వచ్చిందని హసీన్‌ చెప్పింది. ముందుగా తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయం ప్రకటించిన ఆమె, ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడింది. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. షమీ వాట్సప్‌ ద్వారా ఇతర మహిళలతో చేసిన చాటింగ్‌ జాబితాను కూడా ఆమె బయట పెట్టింది. అయితే షమీ వీటన్నింటిని ఖండించాడు. తనకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకు కొందరు పన్నిన కుట్రగా అతను దీనిని అభివర్ణించాడు.

ఇంట్లో వాళ్లూ హింసిస్తున్నారు... 
షమీకి, హసీన్‌ జహాన్‌కు 2014లో పెళ్లయింది. వీరికి ఒక పాప కూడా ఉంది. మోడల్‌ అయిన హసీన్‌ వస్త్రధారణవంటి విషయాల్లో అనేక సార్లు షమీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే తన భార్యను సమర్థిస్తూ వాటికి గట్టిగా జవాబిచ్చిన షమీ... పదే పదే ఆమెపై తన ప్రేమను ప్రదర్శిస్తూ వచ్చాడు. ‘చాలా కాలంగా షమీ కుటుంబ సభ్యులు నన్ను హింసిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు కూడా దుర్భాషలాడారు. తెల్లవారు జామున 3 వరకు కూడా ఈ వేధింపులు కొనసాగేవి. వాళ్లు నన్ను చంపాలని కూడా చూశారు. షమీ కూడా చాలా సార్లు నన్ను తిట్టడం, కొట్టడం చేశాడు. నా కుటుంబం కోసం ఇంతకాలం ఆగిన నేను ఇక భరించలేకపోయాను.’ అని హసీన్‌ వెల్లడించింది.  

అసభ్య సంభాషణలు...
షమీ తనను మోసం చేస్తూ అనేక మంది మహిళలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని కూడా హసీన్‌ ఆరోపించింది. దీనికి సంబంధించి వేర్వేరు మహిళలతో జరిపిన వాట్సప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ స్క్రీన్‌ షాట్‌లను కూడా ఆమె బయట పెట్టింది. ఇందులో షమీ పలు అసభ్యకర సందేశాలు వారికి పంపించినట్లుగా కనిపిస్తోంది. ‘2014 ఐపీఎల్‌ సమయంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు కానుకగా ఇచ్చిన ఫోన్‌ను షమీ ఇందు కోసం ఉపయోగించుకున్నాడు. అతని కారులో ఈ ఫోన్‌ బయటపడింది. అతి కష్టమ్మీద నేను దాని లాక్‌ ఓపెన్‌ చేయగలిగాను. అతను ఒక పాకిస్తాన్‌ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వస్తూ ఆమెను కలిసేందుకు అక్కడికి వెళ్లాడు కూడా. తనతో పాటు నేను కూడా ధర్మశాలకు వస్తానని చెబితే తిరస్కరించాడు. భారత జట్టు ఎక్కడికి వెళ్లినా కుల్దీప్‌ అనే వ్యక్తి షమీకి అమ్మాయిలను సరఫరా చేస్తుంటాడు. బీసీసీఐ కూడా ఈ విషయంలో ఏమీ చేయడం లేదు’ అని హసీన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘షమీపై న్యాయపరమైన చర్య తీసుకుంటాం. అయితే దానికి ముందు అతను తన తప్పు తెలుసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కూడా భావిస్తున్నాం’ అని హసీన్‌ లాయర్‌ జాకీర్‌ హుస్సేన్‌ వెల్లడించారు.

కాంట్రాక్ట్‌లో చోటు లేదు 
బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో షమీకి చోటు దక్కలేదు. తాజా పరిణామాల నేపథ్యంలోనే చివరి నిమిషంలో అతని పేరును జాబితా నుంచి తప్పించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ‘షమీ కాంట్రాక్ట్‌ను నిలిపే విషయంలో మేమే సందిగ్ధ స్థితిలో నిలిచాం. అవి వ్యక్తిగత ఆరోపణలైతే కాంట్రాక్ట్‌ ప్రొఫెషనల్‌కు సంబంధించినది కదా అనే సందేహం వచ్చింది. అయితే ఆరోపణలు ఇంత తీవ్రంగా ఉన్నా మీరు అతడికి గుర్తింపు ఇస్తున్నారు కదా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంది’ అని సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ స్పష్టతనిచ్చారు. తాజా వివాదంపై విచారణ పూర్తయ్యే వరకు షమీకి కాంట్రాక్ట్‌ దక్కదు. తనపై భార్య చేసిన ఆరోపణలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ద్వారా షమీ ఖండించాడు. ‘మా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవాలు. మాపై జరుగుతున్న పెద్ద కుట్ర ఇది. నా పరువు తీయడంతో పాటు నా ఆటను దెబ్బతీసేందుకే ఈ ప్రయత్నం జరుగుతోంది’ అని షమీ వివరణ ఇచ్చాడు. 

#

Tags : 1

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)