Breaking News

చెపాక్‌లో ఆర్సీబీకి కష్టమే?

Published on Sat, 03/23/2019 - 18:28

చెన్నై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12 గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఐపీఎల్‌లో బలమైన జట్లలో  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఒకటి కానీ ట్రోఫీ మాత్రం ఈ జట్టుకు అందని ద్రాక్షలా మిగిలింది. కనీసం ఈ సారైనా తమ అభిమాన జట్టు ట్రోఫీని ముద్దాడాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే తొలి పోరులోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వంటి బలమైన జట్టుతో కోహ్లి సేన తలపడుతోంది. అందులోనూ చెన్నైలోని చెపాక్‌ మైదానంలో. మామూలుగానే గర్జించే సీఎస్‌కే జట్టు సొంతమైదానంలో బెబ్బులిలా రెచ్చిపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో చెపాక్‌లో ఆర్సీబీకి కష్టాలు తప్పవని అంటున్నారు. ఇక్కడ ఆర్సీబీకీ కూడా అంత ఘనమైన రికార్డులేమి లేవు. చివరగా ఆడిన ఏడింటిలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.

సీఎస్‌కే కంచుకోట
ఏ జట్టుకైనా సొంతమైదానంలో ఆడటం అదనపు బలం. అయితే సీఎస్‌కేకు అంతకుమించి. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం ధోనిసేనకు కంచుకోట వంటిది. సీఎస్‌కే ఇక్కడ చివరగా ఆడిన 13 మ్యాచ్‌లో కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఓడిపోయింది. ఇక 2008లో అనిల్‌ కుంబ్లే సారథ్యంలోని ఆర్సీబీ చివరగా చెపాక్‌లో సీఎస్‌కేను 14 పరుగుల తేడాతో ఓడించింది. సీఎస్‌కే బలమైన జట్టు అనడంలో సందేహమేలేదని.. కానీ తమ వ్యూహాలు తమకున్నాయని ఆర్సీబీ సారథి విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశాడు.   
 

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)