Breaking News

'షేర్ ఖాన్' శ్రీహరి ఫోటో గ్యాలరీ

Published on Wed, 10/09/2013 - 18:46

నటుడు శ్రీహరి ఇకలేరన్న వార్తను టాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. శ్రీహరి అంటే ఒక విలన్, కాదు క్యారక్టర్ ఆర్టిస్ట్... కమేడియన్, కాదు కాదు ఓ రియల్ స్టార్! ఇవన్నీ కాదు ఆయనంటే ఎదో ఒక పాత్ర కాదు; అల్లరి చేసే పిల్లల చెవి మెలేసే మామయ్య, చెల్లెళ్ల వెంటపడే పోకిరుల తోలుతీసే అన్నయ్య. శకునంలా ఎదురొచ్చినట్టు, పొలమారితే గుర్తొచ్చినట్టు...ఎంతో దగ్గరగా.. చనువుగా... కొన్ని సార్లు సొంత మనిషిలా, అంతే దూరంగా... బెరకుగా... మరికొన్ని సార్లు పరాయివాడిలా .... అనిపించి, కనిపించిన శ్రీహరి కేవలం తెర మీద బొమ్మ కాదు,  తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర.  1964 ఆగస్టు 15న హైదరాబాద్ లోని బాలానగర్ జన్మించిన శ్రీహరి సుమారు 97 సినిమాల్లో నటించారు. తమిళంలో మా పిళ్లై, తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రంతో  సినీ జీవితాన్ని ఆరంభించారు.

ఫైటర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా చెరగని ముద్ర వేశారు. ఆయన భార్య సినీ డ్యాన్సర్ డిస్కో శాంతి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీహరి చివరి చిత్రం తుఫాన్. 

పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. తన కూతురు అక్షయ ఫౌండేషన్ ద్వారా శ్రీహరి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలో నాలుగు గ్రామాలను దత్తతకు తీసుకున్నారు.

49 ఏళ్ల వయసులో కాలేయ సంబంధ వ్యాధితో అకాల మరణం చెందడం చిత్ర పరిశ్రమ ప్రముఖులను షాక్కు గురిచేసింది. ఆయన మృతికి సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.  

#

Tags : 1

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)