Breaking News

డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది

Published on Tue, 04/21/2020 - 20:15

మొరదాబాద్‌: వైద్య సిబ్బంది, పోలీసులపై దాడికి పాల్పడిన ఐదుగురికి కరోనా వైరస్‌ సోకింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌ జిల్లాలో ఈ నెల 15న ఈ దాడి జరిగింది. ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులతో పాటు 10 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఐదుగురు కోవిడ్‌ బారిన పడినట్టు మొరదాబాద్‌ ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ ఎంసీ గార్గ్‌ మంగళవారం వెల్లడించారు. ‘జైలు నుంచి 11 నమూనాలు పరీక్షల కోసం పంపించగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 10 మంది కరోనా హాట్‌స్పాట్‌కు చెందిన వారు. వైద్య, పోలీసు సిబ్బందిపై రాళ్లు విసిరిన కేసులో వీరు నిందితులు. ఒక వ్యక్తి మరో కేసులో అరెస్టయ్యాడు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్నవారందరినీ క్వారంటైన్‌ చేస్తామ’ని డాక్టర్‌ గార్గ్‌ చెప్పారు. (పాపం.. కరోనా కాటుకు డాక్టర్‌ మృతి)

కోవిడ్‌-19 మృతుడి కుటుంబ సభ్యులను తీసుకొచ్చేందుకు అంబులెన్స్‌లో వెళ్లిన వైద్య సిబ్బంది, పోలీసులపై ఈ నెల 15న స్థానికులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. నేషనల్‌ సెక్యూరిటి యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని,  ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంతో అవి కూడా వారితోనే కట్టించాలని పోలీసులను ఆదేశించారు. కాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 1294 కరోనా పాజిటివ్‌ నమోదు కాగా, 20 మంది మృతి చెందారు. 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

లాక్‌డౌన్‌: కేంద్రం వివాదాస్పద ప్రకటన

Videos

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)