Breaking News

విడాకులు తీసుకోనున్న రాజకుమార్తె

Published on Sun, 12/09/2018 - 11:59

జైపూర్‌ : జైపూర్‌ రాజకుమారి, సవాయి మాధోపూర్‌ ఎమ్మెల్యే దియా కుమారి విడాకుల కోసం దరఖాస్తు చేశారు. హిందూ వివాహ చట్టం 13బీ సెక్షన్‌ కింద గాంధీనగర్‌ ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్‌ దాఖలు చేశారు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. కాగా జైపూర్‌ మహారాజు భవానీ సింగ్‌ కుమార్తె అయిన దియా కుమారి నరేంద్ర సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట 1997లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో 21 ఏళ్ల తర్వాత ఈ జంట విడిపోనున్నది.


    భర్త, పిల్లలతో దియాకుమారి

ఇక బీజేపీ తరపున సవాయి మాధోపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దియా కుమారి ఇటీవల జరిగిన రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వ్యక్తిగత కారణాల వల్ల పోటీకి దూరంగా ఉన్నానని ప్రకటించడంతో ఆమె స్థానంలో ఆశా మీనా అనే కొత్త అభ్యర్థికి బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే లోక్‌సభ అభ్యర్థిగా దియాను రంగంలోకి దింపాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఆశాకు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

#

Tags : 1

Videos

ఇప్పటికీ మా వాళ్లు ఆసుపత్రిలోనే ఉన్నారు

KSR Comment: ఒక్క హామీ..100 కండిషన్లు.. పోయాం మోసం

సంచలన ఆడియో.. పోలీసులు, టీడీపీ నేతలే నన్ను చంపేశారు..

గుండు పిన్నుపై జాతీయ జెండా

మందు పాటలు పాడుతున్న రాజేషు

ప్రకాశం బ్యారేజి వద్ద పర్యాటకుల సందడి

త్రివిక్రమ్ - వెంకీ సినిమాలో డబుల్ గ్లామర్!

జమ్మూకశ్మీర్ కిష్టవర్ లో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య

16 ఏళ్లకే సొంత కంపెనీ.. 18 ఏళ్లకే రూ.100 కోట్ల సామ్రాజ్యం

ఈసారైనా రవితేజ హిట్ కొడతాడా..?

Photos

+5

మంచి నిద్ర కోసం..ఏడు చిట్కాలు..!

+5

సంతానాన్ని ప్రసాదించే కిట్టయ్య.. తెలుగు నేలపై ఈ ఆలయాల గురించి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో పంద్రాగస్టు వేడుకలు (ఫోటోలు)

+5

ఎ‍ర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్ ప్రెస్‌మీట్‌లో మెరిసిన సెలబ్రిటీస్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ యాంకర్ లాస్య వరలక్ష్మీ వ్రతం.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ కపూర్, సిద్ధార్థ్‌ మల్హోత్ర.. ఫోటోలు

+5

ఏఐ దెబ్బకి ఈ ఉద్యోగాలు పోతాయ్!

+5

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీర వనితలు

+5

Independence Day 2025: రోమాలు నిక్కబొడిచేలా, దేశభక్తి ఉప్పొంగేలా.. (ఫోటోలు)