Breaking News

డిటెక్టివ్ విద్యాబాలన్

Published on Thu, 09/26/2013 - 01:11

నీటుగా చీర కట్టుకుని అభినయించే పాత్రలే కాదు.. హాట్‌గా మినీ డ్రెస్‌లేసుకుని కూడా అద్భుతంగా అభినయించగలరు విద్యాబాలన్. అయితే ఆ అభినయం జుగుప్సాకరంగా మాత్రం ఉండదు. అందుకే ‘డర్టీ పిక్చర్’లో ఆమె కాస్తంత విజృంభించినా ప్రేక్షకులు మెచ్చుకున్నారు... జాతీయ అవార్డు కూడా వచ్చింది. 
 
ఎప్పటికప్పుడు వినూత్న పాత్రలు చేయడానికి ఇష్టపడే విద్యాబాలన్ ఈసారి డిటెక్టివ్‌గా కనిపించబోతున్నారు. తన భర్త సాహిల్ సంగాతో కలిసి నటి దియా మిర్జా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో డిటెక్టివ్ పాత్ర చేయాలని కోరగానే విద్యా కథ విన్నారు. ఈ స్టోరీ, తన పాత్ర బాగా నచ్చడంతో ఎగ్జయిట్ అయ్యి, వెంటనే పచ్చజెండా ఊపేశారామె. 
 
ఈ చిత్రానికి ‘బాబీ జాసూస్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సమర్ షైక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా నవంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉంటే, విద్యాబాలన్, దియా మంచి స్నేహితులు.  ఈ చిత్రంలో విద్యా నటించడానికి అది కూడా ఓ కారణం. ఈ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్నానని విద్యా అంటున్నారు.
 

Videos

YS జగన్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పు చంద్రబాబు

నేపాల్ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన సుశీల కర్కి

తండైన మెగా హీరో.. వారసుడొచ్చాడు..!

బాబు ఇచ్చేది ఇది.. ఉల్లి రైతులపై.. బాబు దెబ్బ

విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభణ

Bhumana: తిరుమల అంటే TV5 ఆఫీస్ కాదు ఇదేం పని నాయుడూ

అనంతపురంలో కూటమి సభ అట్టర్ ఫ్లాప్

సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లోకి రానున్న ఐఫోన్-17

నేపాల్‌లో చెలరేగిన అల్లర్లలో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్రవాసులు

రౌడీషీటర్ శ్రీకాంత్, అతని అనుచరుడు జగదీష్ ఫోన్ కాల్ ఆడియో వైరల్

Photos

+5

భార్యతో వేకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న జవాన్ డైరెక్టర్‌ అట్లీ (ఫొటోలు)

+5

ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పుజారా దంపతులు (ఫొటోలు)

+5

చీరలో మెరిసిపోతున్న అలనాటి స్టార్ హీరోయిన్ మీనా (ఫొటోలు)

+5

ఇదే నా బెస్ట్ లైఫ్.. త్రిష పోస్ట్ వైరల్ (ఫొటోలు)

+5

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అవార్డ్ వేడుకలో బాలీవుడ్ బ్యూటీస్ (ఫొటోలు)

+5

అ‍త్తారిల్లు, భర్తతో టూర్స్.. నటి అభినయ ఆగస్ట్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఆసియా కప్‌-2025కి రె‘ఢీ’ అంటున్న కెప్టెన్లు.. హైలైట్‌గా సూర్య (ఫొటోలు)

+5

ఏపీలో కదం తొక్కిన రైతులు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో భారత మహిళా క్రికెటర్‌ శ్రీ చరణి (ఫొటోలు)

+5

అల్లు కనకరత్నం పెద్దకర్మ... చిరు, రామ్ చరణ్ సహా (ఫొటోలు)