Breaking News

అందుకే ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌ను: న‌య‌న్‌

Published on Tue, 07/14/2020 - 15:11

ద‌క్షిణాదిన అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన న‌య‌న‌తార.. ఇప్ప‌టికీ మీడియా ముందు మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌దు. ముఖ్యంగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు చెప్ప‌డమంటే ఆమెకు బొత్తిగా న‌చ్చ‌దు. అందుకే.. ఎంత‌మంది ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించినా స‌రే.. ఇంట‌ర్వ్యూలో పాల్గొనే ప్ర‌స్తే లేద‌ని తేల్చి చెప్తుంది. అలాంటి ఈ లేడీ సూప‌ర్ స్టార్ ఓ మీడియాకిచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో తాను ఇంట‌ర్వ్యూల‌కు అంగీక‌రించిపోవ‌డానికి గ‌ల ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టింది. తానేం ఆలోచిస్తుందో ప్ర‌పంచానికి తెలియాల‌నుకోవ‌ట్లేద‌ట. వ్య‌క్తిగ‌త విష‌యాలు చెప్పుకోవ‌డం ఇష్ట‌ముండ‌ద‌ని, పూర్తిగా ప్రైవేటు ప‌ర్స‌న్‌ అని చెప్పుకొచ్చింది. పైగా ఆమె మీడియాతో మాట్లాడిన విష‌యాల‌ను చాలాసార్లు త‌ప్పుగా ప్ర‌చారంగా చేశార‌ని వాపోయింది. (లాలీపాప్‌ కావాలా కన్నా..!)

అందుకే ఇలాంటివి త‌న‌వ‌ల్ల కాద‌ని, కేవ‌లం తాను న‌టించిన సినిమాల గురించే మాట్లాడ‌తాన‌ని పేర్కొంది. మీడియాకు దూరంగా ఉంటే, లేనిపోని వివాదాల‌కు కూడా దూరంగా ఉండేందుకు దోహ‌ద‌పడుతుంద‌ని ఆమె తెలిపింది. కాగా న‌య‌న్‌ ప్ర‌స్తుతం 'కాతు వాకుల రెండు కాద‌ల్' అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ చిత్రానికి ఆమె ప్రియుడు విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే త‌మిళ‌నాడులోని ఓ ఆల‌యంలో పెళ్లి చేసుకోనున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే దీని గురించి ఈ ప్రేమికులిద్ద‌రూ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. (నా పిల్లలకు కాబోయే తల్లి నయన్‌: విఘ్నేశ్‌)

Videos

గిరిజనుల రక్తం తాగుతున్న జనసేన ఎమ్మెల్యే

రోహిత్‌ను నిండా ముంచిన గిల్

సుడిగుండంలో కొట్టుకుపోతారు కూటమికి CPI రామకృష్ణ మాస్ వార్నింగ్

జగన్ ను దెబ్బ తీయాలనే బాబు చిల్లర రాజకీయాలు

భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం

Low Class Politics: దావోస్ లో ఇమేజ్ డ్యామేజ్

బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం

పాలసీల ముసుగులో స్కాములు.. స్కీములు

హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

Sailajanath: లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే

Photos

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)