మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
పవన్ కల్యాణ్ అభిమానులపై నాగబాబు ఆగ్రహం
Published on Sat, 08/22/2015 - 14:12
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ అభిమానులపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్పకళా వేదికలో చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులపై శుక్రవారం రాత్రి నాగబాబు ధ్వజమెత్తారు. చిరంజీవి బర్త్ డే వేడుకలకు పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. దాంతో ఆడిటోరియంలో వున్న అనేక మంది పవన్ కల్యాణ్ అభిమానులు.. స్టేజ్ మీదికి వచ్చి ఎవరు మాట్లాడినా పట్టించుకోకుండా 'పవర్ స్టార్..పవర్ స్టార్' అంటూ పెద్ద ఎత్తున కేకలు పెట్టడం మొదలుపెట్టారు. ఇంకేముందు నాగబాబుకు చిర్రెత్తింది.
' చాలాసార్లు ఓపిక పట్టాం, వాడు రాకపోతే మేమేం చేస్తాం. పవన్ ను ఎన్నిసార్లు పిలిచామో తెలుసా మీకు? దమ్ముంటే మీరెళ్లి పవర్ స్టార్ అడగండి. ఇక్కడ అరవడం కాదు. ప్రతిసారీ పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరుస్తారు. మీకు దమ్ముంటే వాడి ఆఫీసుకు వెళ్లండి. వాడి ఇంటికి వెళ్లండి రమ్మనండి. ఇక్కడ చాలామంది అన్నయ్య ఫ్యాన్స్ ఉన్నారు.
రావటం, పవర్ స్టార్ అని అరవడం, స్టేజి ఎక్కి అల్లరి చేయడం ఎన్నిసార్లుని భరిస్తాం. కావాలనే పవర్ సార్ట్ అంటూ అల్లరి చేస్తున్నారు. మాకు తెలియదా, మా తమ్ముడు మాకు కావాలని. మీకు దమ్ముంటే అక్కడకు వెళ్లి ఎందుకు రావడం లేదని అడగండి. ఇక్కడ అరవడం కాదు' అంటూ నాగబాబు మండిపడ్డారు.
Tags : 1