Breaking News

ప్రముఖ గాయకుడు కన్నుమూత

Published on Tue, 10/09/2018 - 20:03

ముంబై : టీవీ నటి రోమా బాలి భర్త, ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు నితిన్‌ బాలి కన్నుమూశారు. నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు పాలైన నితిన్‌, ఈ రోజు ఉదయం చనిపోయారు. మాలద్‌ నుంచి బొరివిల్లిలో ఉన్న తన ఇంటికి వెళ్తున్న క్రమంలో, గాయకుడి కారు డివైండర్‌ను ఢీకొట్టింది. వెంటనే ఆయన్ని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత తలకు, ముఖానికి తగిలిన గాయాలకు చికిత్స తీసుకున్నారు. ఆ అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. కానీ ఇంటికి వెళ్లిన తర్వాత, ఆయన మృత్యువాత పట్టారు.

ఇంటికి చేరుకున్న వెంటనే నితిన్‌ రక్తపు వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందని, ఆయన ఇంట్లో కుప్పకూలిపోవడమే ఒక్కసారిగా హార్ట్‌ రేటు పడిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోయారు. గాయకుడి మేనకోడలు ఈ విషయాన్ని ధృవీకరించారు. నితిన్‌ అంత్యక్రియలు రేపు జరిగే అవకాశమున్నాయి. కాగా, నితిన్‌ 1990 కాలంలో గాయకుడిగా బాగా ప్రసిద్ధి పొందారు. ‘నీలే నీలే అంబర్‌ పర్‌’ అనే క్లాసిక్‌ పాటతో ఎక్కువగా ఫేమస్‌ అయ్యారు. ఈ పాట ఆల్‌టైమ్‌ చార్ట్‌బాస్టర్స్‌గా నిలిచింది. ఈ పాట బ్లాక్‌ అండ్‌ వైట్‌ వీడియోలో రూపొందింది. ఆరుకు పైగా ఆల్బమ్స్‌ చేశారు. అవన్నీ చార్ట్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ‘నా జానే’తో మ్యూజిక్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే నితిన్‌ చాలా లో-ప్రొఫైల్‌ నిర్వహించేవారు. 2012లోనే మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు.   

Videos

నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)