Breaking News

ఐష్‌ను ఇంట్లో అలాగే పిలుస్తారు!

Published on Sat, 11/24/2018 - 17:07

ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యాయ్‌కు తన పుట్టింటి వారితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యుల పుట్టిన రోజు వేడుకలు, రాఖీ పండుగ ఇలా ప్రతీ సందర్భంలోనూ అక్కడ ఐష్‌ సందడి ఉండాల్సిందే. ఆ సమయంలో ఓ సెలబ్రెటీ అనే విషయం మర్చిపోయి మరీ మేనల్లుళ్లతో కలిసి ఐశ్వర్య చిన్నపిల్లగా మారిపోయి అల్లరి చేస్తారట. ఈ విషయాన్ని ఆమె వదిన శ్రిమా రాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా రివీల్‌ చేశారు.

ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ బ్లాగర్‌ మెయింటేన్‌ చేసే శ్రిమా... ‘మాతృత్వం గురించి నా బ్లాగ్‌ పోస్ట్‌లో ఎలాంటి వివరాలు తెలుసుకోవాలనుంకుంటున్నారు’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఫాలోవర్లను అడిగారు. ఈ క్రమంలో.. ‘సెలబ్రిటీ అయిన ఐష్‌ గురించి మీ పిల్లలకు ఎలా, ఏమని చెబుతారు’ అని ప్రశ్నించగా..‘మా ఇంట్లో అసలు ఆ విషయమే చర్చకు రాదు. తనెప్పుడూ నా పిల్లలకు గులూ మామీనే’ అంటూ ఐశ్వర్యారాయ్‌కు మేనల్లుళ్లు పెట్టిన క్యూట్‌ నిక్‌ నేమ్‌ను బయటపెట్టారు. కాగా ఐశ్వర్యారాయ్‌ సోదరుడు ఆదిత్యా రాయ్‌ను పెళ్లాడిన శ్రిమా 2009లో మిసెస్‌ ఇండియా టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ జంటకు విహాన్‌, శివాన్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Videos

చిక్కుల్లో ఆసియా కప్

మిరాయ్ పై అంచనాలు పెంచేసిన ప్రభాస్..!

ప్రశ్నిస్తే దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్‌

ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించలేకపోతున్నారు: అంబటి రాంబాబు

కొట్టేసిన దేవుడి భూముల్లో OG ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏంటి?

నేపాల్ నిరసనల్లో భారతీయ మహిళ మృతి

మద్యానికి దూరంగా ఉంటా.. అలాంటిది చిత్రహింసలు పెడుతున్నారు.. చెవిరెడ్డి ఎమోషనల్..

తండ్రిని మించిన కొడుకు.. రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన

రూ.99కే చీర.. ఎగబడ్డ అమ్మలక్కలు

మటన్ ముక్క లేక ఆగిన పెళ్లిళ్లు..!

Photos

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)

+5

వైభవంగా పోలేరమ్మ నగరోత్సవం.. కిక్కిరిసిన వెంకటగిరి (ఫొటోలు)

+5

7వ ఆల్‌ ఇండియా ప్రిజన్‌ డ్యూటీ మీట్‌ ముగింపు వేడుక (ఫొటోలు)

+5

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫోటోలు)

+5

బిగ్‌బాస్‌ మానస్‌ కుమారుడి ఫస్ట్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)