Breaking News

కావాలని కరోనా అంటించుకుని..

Published on Fri, 04/03/2020 - 17:43

బెర్లిన్‌ : ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ పేరు చెబితేనే భయంతో వణకిపోతున్నాయి. ఇలాంటి సమయంలో  జర్మనీ బెర్లిన్‌ జిల్లా మేయర్‌ స్టీఫెన్ వాన్ డాసెల్ మాత్రం కావాలనే కరోనా వైరస్‌ను తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. అయితే తాను ఇలా చేయడం వెనక ఒక బలమైన కారణం ఉందని స్టీఫెన్‌ చెబుతున్నాడు. తన పార్ట్‌నర్‌ నుంచి కరోనా వైరస్‌ సోకేలా చేసుకున్నానని స్టీఫెన్‌ తెలిపారు. కరోనాను తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని భావించానని.. అందుకోసమే ఇలా చేశానని వెల్లడించాడు. 

అయితే కరోనా వైరస్‌ తాను ఊహించని దానికంటే దారుణంగా ఉందని స్టీఫెన్‌ పేర్కొన్నాడు. తను అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం అనారోగ్యానికి గురైనట్టు వెల్లడించారు. దీనిని ఎవరికి సోకకుండా చూస్తానని అన్నారు. అయితే స్టీఫెన్‌ చేసిన పనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడితే.. మిగతావారికి కూడా కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది వైద్యుల సూచనలకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. 

అయితే స్టీఫెన్‌ మాత్రం తను ప్రపంచం కోసమే ఈ పని చేశానని అంటున్నాడు. తన పార్ట్‌నర్‌కు కరోనా సోకడంతో.. నేను కూడా క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనా ఒకరి నుంచి మరోకరికి సోకుండా నిలువరించలేమని అన్నారు. కరోనా కట్టడి కోసం కృషి​ చేస్తాననని చెప్పారు. బాధ్యత గత వ్యక్తిగా కరోనా నుంచి కోలుకునే వరకు క్వారంటైన్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. 

చదవండి : కరోనా: గంగవరం పోర్టు యాజమాన్యం విరాళం

చేతులెత్తి నమస్కరిస్తున్నా: బాలకృష్ణ

Videos

ఫ్రీ బస్సు.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ అవుతున్న వీడియో

మీరు ఓడిపోయిన పర్లేదు.. పోటీ చేసిన ఒక్కొక్కరికి మాటిస్తున్నాను

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

తెలుగులోకి 'హనుమాన్ అంశ్ గురూజీ మాస్టర్ ప్లాన్

భారతీయులకు గుడ్ న్యూస్.. H-1Bపై కీలక అప్ డేట్

AIతో డేంజర్.. బ్రేకులు వేయాల్సిందే.. ఆంథ్రోపిక్ CEO సంచలనం

పార్టీని వీడే ప్రసక్తేలేదు.. కొండా ఫ్యామిలీ సంచలన వ్యాఖ్యలు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

పోలవరంలో పాప ఘటన.. MP తనూజ రాణి ఎమోషనల్

ఒక్కటి గుర్తుపెట్టుకో.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై కోలగట్ల వీరభద్రస్వామి కౌంటర్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)