మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
యువకుడి దారుణహత్య
Published on Fri, 03/03/2017 - 00:22
- మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు
- స్థానికేతరుడిగా గుర్తించిన పోలీసులు
- నన్నూరు సమీపంలో ఘటన
ఓర్వకల్లు : మండల పరిధిలోని నన్నూరు సమీపంలో బుధవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఘటన తీరును బట్టి పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది. కత్తులతో విచక్షణా రహితంగా నరికి, హత్యానంతరం మృతదేహానికి తగులపెట్టారు. నన్నూరు సమీపంలోని నారాయణ బాలికల జూనియర్ కళాశాలకు కూతవేటు దూరంలో జమాల్‌షా దర్గాకు వెళ్లే దారిలో జాతీయరహదారి పక్కనే గురువారం కాలిపోయిన శవం స్థానికులు గుర్తించారు. ఈ మేరకు తాలుకా రూరల్ సీఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగాలపురం ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రక్తపు మరకలు, మృతదేహంపై లోతైన గాయాలను బట్టి పోలీసులు హత్యగా గుర్తించారు.
వాహనంపై తీసుకొచ్చి తల, మెడ, భుజాలు, పొత్తి కడుపుపై విచక్షణా రహితంగా నరికి చంపేసినట్లు తెలుస్తోంది. తర్వాత పెట్రోల్ పోసి శవానికి నిప్పుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కాలిపోవడంతో గుర్తుపట్టలేని విధంగా మారింది. హతుడు నన్నూరు, మీదివేముల, లొద్దిపల్లె గ్రామాల ప్రాంతానికి చెంది ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తుండగా పోలీసులు మాత్రం స్థానికేతరుడిగా చెబుతున్నారు. డాగ్‌స్క్వాడ్ బృందం అక్కడికి చేరుకుని పరిసరాల్లో తనిఖీలు చేశారు. ఆచూకీ కోసం మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఐసుపెట్టెలో భద్రపరచనున్నట్లు ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
#
Tags : 1