Breaking News

కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించాలి

Published on Thu, 08/04/2016 - 23:04

కడప సెవెన్‌రోడ్స్‌:
కనీస వేతనాల చట్టం కింద ఉన్న షెడ్యూల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్స్‌లో కార్మికుల కనీస వేతనం నెలకు రూ. 18 వేలుగా నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం వేతనాలను సవరించాల్సి ఉంటుందన్నారు. షెడ్యూల్డ్‌–1లోని 65 ఎంప్లాయ్‌మెంట్స్‌కు గాను 54 ఎంప్లాయ్‌మెంట్స్‌లో వేతన సవరణ పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. 2011, 2012లో షెడ్యూల్డ్‌–1లోని మిగతా 11 ఎంప్లాయ్‌మెంట్స్‌కు జరిగిన వేతన సవరణల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆయిల్‌మిల్లులు, పేపరు మిల్లుల కార్మికులకు వేతనాలు తగ్గించడం అన్యాయమన్నారు. స్పిన్నింగ్‌ మిల్లులు, గార్మెంట్స్‌ కార్మికులకు అతి తక్కువ వేతనాలు నిర్ణయించడం న్యాయం కాదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా వేతన సవరణ పెండింగ్‌లోనే ఉందని విమర్శించారు. ఇందువల్ల కార్మికులు వేలాది కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతనాల సలహాబోర్డును ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బద్వేలు శ్రీను, రిమ్స్‌ సుబ్బయ్య, సునీల్, అన్వేష్, మున్సిపల్‌ వర్కర్లు, యార్డు హమాలీలు, ఆటో వర్కర్లు, ఐఎంఎల్‌ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
 

Videos

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్

Miss World 2025: అందం అంటే..!

మాట నిలబెట్టుకున్న జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై

సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?

ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం

Photos

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)