మీడియాపై సుజనా రుసరుస

Published on Mon, 12/03/2018 - 16:01

చెన్నై : వేల కోట్ల రుణాలు కొల్లగొట్టి బ్యాంకులకు టోకరా వేసిన కేసులో టీడీపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సేకరించిన మొత్తాలను దారిమళ్లించిన వైనంపై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం. డొల్ల కంపెనీలపైనా ఈడీ అధికారులు పలు కోణాల్లో సుజనాను ప్రశ్నించినట్టు తెలిసింది.

ఈడీ విచారణ ముగిసిన అనంతరం సుజనా చౌదరిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేక వారిపై చిందులు తొక్కారు. ఎప్పటిలాగానే తన సహజసిద్ధ దబాయింపు ధోరణితో తాను నిజాయితీపరుడినని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ  దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 126 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 7500 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది.

ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్‌ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్‌ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.

Videos

వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటే దాడి.. ఏపీలో దాడులపై షర్మిలా రెడ్డి ఫైర్

ప్రియుడితో కలిసి భర్తపై భార్య దారుణం

హైదరాబాద్ లో భారీ వర్షం

ఎంతవరకైనా సిద్ధం..

నో పోలీస్.. నో కేసు.. టీడీపీ, జనసేన దాడులపై పేర్ని నాని ఫైర్..

పోలీసుల ప్రేక్షక పాత్ర కొడాలి నాని షాకింగ్ రియాక్షన్

రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

పేర్ని కిట్టును అడ్డుకున్న పోలీసులు..

ఎన్నికల ఫలితాలపై మార్గాని భరత్ షాకింగ్ రియాక్షన్..

లోక్ సభ ఫలితాలపై ఖర్గే అసంతృప్తి..

Photos

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)

+5

నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆహ్వానం (ఫోటోలు)

+5

వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ (ఫొటోలు)