Breaking News

బాహుబలి సెట్టింగుల వంటివే కావాలి

Published on Tue, 09/19/2017 - 01:54

రాజధాని డిజైన్లపై రాజమౌళికి మంత్రి నారాయణ విజ్ఞప్తి
 
సాక్షి, అమరావతి: బాహుబలి సినిమా సెట్టింగ్‌ల తరహాలోనే.. రాజధానిలో భవనాల కోసం కూడా సలహాలివ్వాలని సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌  శ్రీధర్‌ విజ్ఞప్తి చేశారు. రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లను తిరస్కరించిన సీఎం వెంటనే రాజమౌళిని కలసి సలహాలు తీసుకోవాలని ఇటీవల మంత్రి నారాయణను ఆదేశించారు.

ఈ మేరకు మంత్రి నారాయణ, శ్రీధర్‌లు.. అపాయింట్‌మెంట్‌ తీసుకొని సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో రాజమౌళితో భేటీ అయ్యారు.  వారిచ్చిన డిజైన్లు చూసిన రాజమౌళి తన అభిప్రాయాలను చెప్పి, మరోసారి కలుద్దామని పంపించినట్లు తెలిసింది.