దారుణంగా లాక్కొని కారులో పడేసి MPTC కల్పన కూతురు సంచలన నిజాలు
Breaking News
వైఎస్ జగన్ దీక్షకు ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మద్దతు
Published on Wed, 10/09/2013 - 20:57
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న సమైక్య దీక్షకు కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి సంఘీభావం తెలిపారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష శిబిరం వేదిక వద్దకు వెళ్లి జగన్ను కలిశారు. వెంకట్రామి రెడ్డి వెంట అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం జగన్ చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు, ఎంపీలు పోరాటం చేస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోకపోవడాన్ని విమర్శించారు.
అనంతపురం లోక్సభ నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపాక కాంగ్రెస్ పార్టీపై బహిరంగంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకట్రామి రెడ్డి.. జగన్ సమైక దీక్షకు మద్దతు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Tags : 1