TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో
Breaking News
ఎంత పెద్ద మనసు ఆ ‘అమ్మ’ది..! ఒడిలో పసికందు, కళ్లముందు ..
Published on Sun, 11/29/2026 - 12:30
కొన్ని దానాలు మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి. సామర్థ్యం, అవకాశం ఉంటే దానం చేయడం వేరు. అస్సలు ఆ వ్యక్తికి దానం చేసేంతటి స్థితి లేకపోయి, పైగా తనే పుట్టెడు కష్టంలో ఉంటే..దానదర్మాల గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. కానీ ఈ అమ్మ అంతటి పరిస్థితుల్లోనూ గొప్ప మనసును చాటుకుని ఎంత పెద్ద దానం చేసేందుకు ముందుకొచ్చిందే తెలిస్తే..కన్నీళ్లు ఆగవు. ఆమె కథ విన్నాక..తప్పకుండా చేతులెత్తి నమస్కరించకుండా ఉండలేరు.
ఈ భావోద్వేగ ఘటన అహ్మదాబాద్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన 32 ఏళ్ల భర్త అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చింది బాధితుడి భార్య. తన భర్తకు చివరి వీడ్కోలు పలకడానికి 28 రోజుల చంటిబిడ్డను తీసుకుని ఆస్పత్రికి వచ్చిన తీరు అందర్నీ కలిచి వేసింది. తనను తన బిడ్డను ఒంటిరి చేసి వెళ్లిపోయిన భర్త దుఃఖాన్ని దిగమింగి అవయవదానం చేసేందుకు ముందుకు రావడం విశేషం, తన వ్యక్తిగత నష్టం గురించి పక్కనపెట్టి అవయవదానానికి అంగీకరించి మరో ముగ్గురు రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
ఇది ఆ ఆస్పత్రిలో జరిగిన మూడోవ అవయవాదనం. దీంతో ఆ ఆస్పత్రిలో మొత్తం 264 అవయవ దానాలను పూర్తి చేసింది. ఇక ఆ 32 ఏళ్ల వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయలై మెరుగైన చికిత్స కోసం నవంబర్ 26న అహ్మదాబాద్ ఆస్పత్రికి తరలించారు. అతన్ని కాపాడటానికి నిపుణులైన వైద్యులు ప్రయత్నించినప్పటికీ, అతని పరిస్థితి విషమంగానే ఉంది. దీంతో నవంబర్ 28న వైద్య బృందం అతన్ని బ్రెయిన్-డెడ్ గా ప్రకటించినట్లు వైద్యులు తెలిపారు. ఈ తాజా దానంతో తమ ఆస్ప్రతికి మొత్తం 1,143 అవయవాలు, కణజాలాలు అందాయన్నారు.
ఈ మేరకు వైద్యులు అవయవ దానం ప్రాముఖ్యతను గురించి నొక్కిచెప్పారు. అలాగే పౌరులు తమ అవయవాలను దానం చేయడానికి ప్రతిజ్ఞ చేసి, ఈ ఉద్యమంలో భాగం చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు కూడా. పైగా ఎవరూ అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తూ ప్రాణాలు కోల్పోకూడదని అన్నారు సదరు ఆస్పత్రి వైద్యులు.
ఇదీ చదవండి: ప్రాణాలను కాపాడే టీకాలు!
Tags : 1