TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో
Breaking News
వరుసగా 3 రోజులు బ్యాంకులు క్లోజ్.. డిసెంబర్ హాలిడేస్ లిస్ట్ ఇదే!
Published on Sun, 11/29/2026 - 07:18
2026 సంవత్సరం ముగియడానికి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్‌లో బ్యాంకుకు వెళ్లి ముఖ్యమైన పనులు పూర్తి చేయాలనుకునే వారు ముందుగానే బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే.. పండుగలు, ప్రత్యేక రోజులు, ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల కారణంగా ఈ నెలలో బ్యాంకులకు పలు సెలవులు ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించే సెలవుల క్యాలెండర్ ప్రకారం.. డిసెంబర్‌లో కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా అదనపు సెలవులు ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 25న క్రిస్మస్, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. అయితే ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. సిక్కిం, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో మరికొన్ని అదనపు సెలవులు కూడా ఉన్నాయి.
డిసెంబర్ నెలలో సెలవుల జాబితా
డిసెంబర్ 1, మంగళవారం: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 3, గురువారం: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్ సందర్భంగా గోవాలో బ్యాంకులు మూసి ఉంటాయి.
డిసెంబర్ 6, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 9, 10, 11: నామ్‌సూంగ్ పండుగ సందర్భంగా సిక్కింలో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 12, శనివారం: రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 13, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 18, శుక్రవారం: యూ సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు పనిచేయవు.
డిసెంబర్ 19, శనివారం: గోవా లిబరేషన్ డే సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 20, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 24, గురువారం: క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులు మూసి ఉంటాయి.
డిసెంబర్ 25, శుక్రవారం: క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 26, శనివారం: నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు.
డిసెంబర్ 27, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 30, బుధవారం: యూ కియాంగ్ నంగ్‌బా వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్యాంకులకు సెలవులు
డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక పండుగల కారణంగా అదనపు బ్యాంక్ సెలవులు పెద్దగా లేవు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. దీనికి తోడు ప్రతి ఆదివారం, రెండో శనివారం, నాలుగో శనివారం సాధారణ సెలవులు ఉంటాయి.
ముఖ్యంగా డిసెంబర్ 25 శుక్రవారం రావడం, ఆ తర్వాత 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉంటే ఈ తేదీలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.
ఆన్‌లైన్ సేవలు అందుబాటులోనే
బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లోనూ.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలను సాధారణంగా ఉపయోగించుకోవచ్చు. వీటి ద్వారా డబ్బులు పంపడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, ఇతర ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడం సాధ్యమవుతుంది.
అయితే కొన్ని పనుల కోసం మాత్రం నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసుకోవడం, పాస్‌బుక్ అప్‌డేట్ చేయించుకోవడం, KYC వెరిఫికేషన్, ఫిజికల్ చెక్కుల డిపాజిట్ వంటి పనులు సెలవు రోజుల్లో పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే డిసెంబర్‌లో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు ముందుగానే సెలవుల జాబితాను పరిశీలించాలి.
ఇదీ చదవండి: యూట్యూబ్ చరిత్రలో సెన్సేషన్.. 10 లక్షల పెయిడ్ మెంబర్స్!
Tags : 1