TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో
Breaking News
మీకు అలా అనిపించకపోతే నేను సినిమాలు చేయడం మానేస్తా
Published on Sun, 11/29/2026 - 03:20
ఈ ఏడాది 'ప్యారడైజ్' సినిమాతో చాలా విమర్శలు ఎదుర్కొన్న నాని.. నిర్మాతగా ఓ ఎంటర్‌టైనింగ్ తీశాడు. అదే 'అలియాస్ రుక్మిణీ'. నితిన్ హీరో కాగా ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. వచ్చే శుక్రవారం ఇది థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే మూవీ గురించి నాని పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
డిసెంబరు 04న 'అలియాస్ రుక్మిణీ' చూసి ఓ బ్యూటిఫుల్ సినిమా చూశామనే ఫీలింగ్ రాకపోతే నేను సినిమాలు మానేస్తా, సుమ యాంకరింగ్ మానేస్తారు. ఇది కంబైన్డ్ ప్రామిస్' అని నాని అన్నాడు. గతంలో 'కోర్ట్' చిత్రాన్ని నిర్మించి విడుదల చేస్తున్న టైంలో ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈసారి కూడా నానిని అలా ఏదైనా స్టేట్‌మెంట్ ఇవ్వమని సుమ బలవంతం చేసింది. దీంతో నాని ఇలా మాట్లాడాల్సి వచ్చింది.
ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే 'అలియాస్ రుక్మిణీ' బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది. మారుపేరుతో అడల్ట్ నవలలు రాసే హీరో.. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు భర్త గురించి నిజం తెలిసిన తర్వాత ఏమైంది? అనేదే కాన్సెప్ట్ అని ట్రైలర్‌తోనే బయటపెట్టేశారు. అయితే ఆరేళ్ల క్రితం దాదాపు ఈ తరహా కాన్సెప్ట్‌తోనే హిందీలో 'మస్త్ రామ్' అనే అడల్ట్ సిరీస్ వచ్చింది. కాకపోతే దాన్ని పూర్తిగా అడల్ట్ టచ్‌తో తీయగా.. దీన్ని లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అనిపిస్తోంది.
THE ‘ULTIMATE’ CONFIDENT STATEMENT from PRODUCER #Nani : “If you don’t feel satisfied with #AliasRukmini… I’LL STOP MAKING MOVIES…!!” https://t.co/Tnnu6Bab9d
— Rangasthalam (@RangasthalamIN) November 28, 2026
Tags : 1