Breaking News

రెండు రోజుల్లో కొత్త రూల్స్‌.. భయపెడుతున్న ‘బ్యాంక్‌ బ్యాలెన్స్‌’!

Published on Sat, 11/28/2026 - 14:26

యూకే(యునైటెడ్ కింగ్‌డమ్‌)లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. 2027 జనవరి ప్రవేశానికి సిద్ధమవుతున్న విద్యార్థులపై ఈ మార్పుల ప్రభావం ఉండనుంది. ఈ నవంబర్ 30 నుంచి సమర్పించే విద్యార్థి వీసా దరఖాస్తులకు కొత్త ఆర్థిక నిబంధనలు వర్తిస్తాయి. వీటి ప్రకారం, చదువుకునే ప్రాంతాన్ని బట్టి విద్యార్థులు తమ జీవన ఖర్చుల కోసం చూపించాల్సిన కనీస నిధులను బ్రిటన్ ప్రభుత్వం పెంచింది.

లండన్‌లో చదువుకునే విద్యార్థులు నెలకు కనీసం 1,570 పౌండ్లు (సుమారు రూ.1.96 లక్షలు), గరిష్ఠంగా తొమ్మిది నెలలకు 14,130 పౌండ్లు (సుమారు రూ.17.66 లక్షలు) చూపించాలి. ఇంతవరకు ఈ పరిమితి నెలకు 1,529 పౌండ్లు కాగా, తొమ్మిది నెలలకు 13,761 పౌండ్లుగా ఉంది. అదే విధంగా లండన్ వెలుపల అంటే యూకేలోని ఇతర ప్రాంతాల్లో చదివేవారు నెలకు 1,203 పౌండ్లు (సుమారు రూ.1.50 లక్షలు), తొమ్మిది నెలలకు గరిష్ఠంగా 10,827 పౌండ్లు (సుమారు రూ.13.53 లక్షలు) నిధులు ఉన్నట్లు నిరూపించాలి. ప్రస్తుతం ఈ మొత్తం నెలకు 1,171 పౌండ్లు, తొమ్మిది నెలలకు 10,539 పౌండ్లుగా ఉంది.

28 రోజుల నిబంధనతోనే అసలు సమస్య!

విద్యార్థులకు పెరిగిన ఆర్థిక పరిమితుల కంటే 28 రోజుల బ్యాంక్ బ్యాలెన్స్ నిబంధన పెద్ద సవాలుగా మారనుంది. బ్రిటన్ వీసా నిబంధనల ప్రకారం, వ్యక్తిగత ఖాతా లేదా తల్లిదండ్రుల ఖాతాలో అవసరమైన మొత్తాన్ని కనీసం 28 వరుస రోజుల పాటు నిర్వహించాలి. ఈ వ్యవధిలో ఏ ఒక్క రోజూ ఖాతాలోని నిల్వ నిర్దేశిత కనీస మొత్తం కంటే తగ్గకూడదు.

అంతేకాదు, ఈ 28 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత పొందిన ఆర్థిక ఆధారాల తేదీ.. వీసా దరఖాస్తు సమర్పించే తేదీకి ముందు 31 రోజుల్లోపు ఉండాలి. ఉదాహరణకు, నవంబర్ 30న కొత్త పరిమితికి అవసరమైన అదనపు మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తే, ఆ మొత్తంతో 28 రోజుల నిబంధన పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. దీంతో జనవరి ప్రవేశానికి సిద్ధమవుతున్న విద్యార్థులు వీసా దరఖాస్తును ముందుగానే ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ట్యూషన్ ఫీజులు అదనం

విద్యార్థులు చూపించాల్సిన జీవన వ్యయాల నిధులు మాత్రమే ఈ పరిమితుల్లో ఉంటాయి. యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొదటి ఏడాది ట్యూషన్ ఫీజులు ఇందులో భాగం కావు. కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ (CAS)లో పేర్కొన్న చెల్లించని ట్యూషన్ ఫీజులను కూడా అవసరమైన మొత్తానికి అదనంగా చూపించాలి. అయితే, యూనివర్సిటీకి ఇప్పటికే చెల్లించిన ఫీజులను తగిన ఆధారాలతో మినహాయించుకోవచ్చు.

మరోవైపు, భారతీయ విద్యార్థులు రూపాయల్లో ఉన్న తమ బ్యాంకు నిల్వలను పౌండ్లలోకి మార్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. వీసా దరఖాస్తు సమర్పించే రోజున అమల్లో ఉన్న OANDA మారకపు రేటు ఆధారంగా బ్రిటన్ వీసా అధికారులు విదేశీ కరెన్సీలోని నిధుల విలువను లెక్కిస్తారు. కాబట్టి మారకపు విలువల్లో మార్పుల కారణంగా అవసరమైన కనీస నిల్వ తగ్గకుండా కొంత అదనపు మొత్తాన్ని అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

అయితే, ప్రతి విద్యార్థికీ ఈ ఆర్థిక ఆధారాలు తప్పనిసరి కాదు. బ్రిటన్‌లో చెల్లుబాటు అయ్యే వీసాతో ఇప్పటికే కనీసం 12 నెలలు నివసించిన కొందరు విద్యార్థులకు ఆర్థిక నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అర్హత కలిగిన ప్రభుత్వ లేదా అధికారిక ఆర్థిక స్పాన్సర్‌షిప్, విద్యార్థి రుణాల ద్వారా కూడా నిధుల అవసరాన్ని నిరూపించుకోవచ్చు.

నవంబర్ 30, 2026కు ముందు దరఖాస్తు చేసుకునేవారికి పాత ఆర్థిక పరిమితులే వర్తిస్తాయి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునేవారు కొత్త మొత్తాలను పాటించాలి. ఇది వీసా దరఖాస్తు రుసుముల పెంపు కాదు. విద్యార్థుల జీవన వ్యయాలకు అవసరమైన నిధుల పెంపు మాత్రమే. అందువల్ల యూకేలో చదువుకోవాలనుకునే భారతీయులు యూనివర్సిటీ ఫీజులు, జీవన వ్యయాలు, బ్యాంకు నిల్వల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)