బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..
Breaking News
రామాయణ చిత్రం తర్వాత ట్రెండ్ అవుతున్న ప్రదేశం ఏదో తెలుసా?
Published on Mon, 11/23/2026 - 09:26
ఇటీవల రామాయణ సినిమా విడుదల అయిన తరువాత ట్రెండ్ అవుతున్న ప్రదేశాల్లో కేరళలోని జటాయు ఎర్త్ సెంటర్ కూడా ఒకటి. రీల్స్ లో, ఇన్ స్టా లో ఈ రాతి పక్షి వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అతిపెద్ద పక్షి శిల్పం
కేరళలోని కొల్లం జిల్లా చడయమంగళం కొండపైనే ఈ సెంటర్ ఉంది. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం అంటారు. రామాయణంలో సీతమ్మను కాపాడటానికి రావణుడితో పోరాడి గాయపడి జటాయువు ఇక్కడే పడ్డారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ కొండకు జటాయుపారా అని కూడా పేరు.
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇది మామూలు విగ్రహం కాదు. ఒక కొండను చెక్కి చేసిన శిల్పం. 200 అడుగుల ΄÷డవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో 1000 అడుగుల ఎత్తున్న కొండపై కూర్చున్నట్టు ఉంటుంది.
ప్రముఖ శిల్పి, ఫిల్మ్ డైరెక్టర్ రాజీవ్ అంచల్ 10 ఏళ్లు కష్టపడి దీన్ని నిర్మించారు. బయట నుంచి చూస్తే గాయపడిన జటాయు రెక్క, ముక్కు, గోళ్లు ప్రతి డీటెయిల్ కనిపిస్తుంది. లోపల సిక్స్ డి థియేటర్, మ్యూజియం ఉన్నాయి.
ఈ కొండపై నుంచి చూస్తే చుట్టూ పచ్చని అడవులు, కొల్లం నగరం కనిపిస్తాయి. అందుకే దీన్ని లెజెండ్ మీట్స్ ఆర్ట్ అంటారు.
హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి తిరువనంతపురానికి ఫ్లైట్లో కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. ఎయిర్ పోర్ట్ నుంచి చడయమంగళం వరకు క్యాబ్ లో 1 గంట 30 నిమిషాల ప్రయాణం ఉంటుంది. కొండ కింద నుంచి పైకి వెళ్లడానికి కేబుల్ కార్ ఉంది. నడవాలనుకుంటే 826 మెట్లు ఎక్కాలి. బడ్జెట్ లో వెళ్లాలంటే శబరి ఎక్స్ ప్రెస్ లో కొల్లం వరకు వెళ్లి బస్సులో వెళ్లవచ్చు.
ఇదీ చదవండి: శివుడి త్రిశూలంపై.. నిలిచిన నగరం!
Tags : 1