Breaking News

UPI యూజర్లకు అలర్ట్‌.. కాసేపు లావాదేవీల నిలిపివేత

Published on Wed, 11/18/2026 - 16:26

యూపీఐ వినియోగదారులకు ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్య గమనిక. నవంబర్ 19న (గురువారం) తెల్లవారుజామున 45 నిమిషాల పాటు యూపీఐ (UPI) సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్‌లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనుందని బ్యాంక్ వెల్లడించింది.

ఎస్‌బీఐ ప్రకటన ప్రకారం.. నవంబర్ 19న తెల్లవారుజామున 1:15 గంటల నుంచి 2:00 గంటల వరకు సాధారణ యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. అయితే నిర్వహణ పనులు ముందుగానే పూర్తయితే సేవలను నిర్ణీత సమయం కంటే ముందే పునరుద్ధరించే అవకాశం ఉంది.

ఈ సమయంలో ఎస్‌బీఐ ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ చెల్లింపులు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్‌ల ద్వారా ఎస్‌బీఐ ఖాతాను ఉపయోగించి చేసే సాధారణ యూపీఐ లావాదేవీలపైనా ఈ ప్రభావం ఉండవచ్చు.

యూపీఐ లైట్‌తో చెల్లింపులు

సాధారణ యూపీఐ సేవలు నిలిచిపోయినప్పటికీ, యూపీఐ లైట్ (UPI Lite) సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కాబట్టి ఈ సమయంలో చిన్న మొత్తాల చెల్లింపులు చేయాల్సిన వారు యూపీఐ లైట్‌ను ఉపయోగించుకోవచ్చు. అత్యవసర చెల్లింపులు చేయాల్సిన కస్టమర్లు ముందుగానే ఈ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకుని అవసరమైన మొత్తాన్ని అందులో లోడ్ చేసుకోవడం మంచిది.

ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం.. చేతులు మారిన ఇళ్లు..

#

Tags : 1

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)