Breaking News

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ అమలెప్పుడు?

Published on Wed, 11/18/2026 - 12:14

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) నిర్వహణ ఆర్థికంగా సుస్థిరంగా ఉండేలా తీసుకొస్తున్న మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) విధానం అమలుపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎంపిక చేసిన యూపీఐ వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్‌ విధించేందుకు సెప్టెంబర్‌లో ప్రకటించిన విధానానికి సంబంధించి తుది అమలు తేదీని వెల్లడించాలని పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)లను కోరుతోంది. పండుగల సీజన్‌ నేపథ్యంలో వాయిదా పడిన ఈ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశంపై చెల్లింపుల పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.

ఎండీఆర్‌ విధానం ఏమిటి?

మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ అంటే డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే వారి నుంచి చెల్లింపుల వ్యవస్థలోని భాగస్వాములు వసూలు చేసే లావాదేవీ రుసుము. బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, యూపీఐ యాప్‌ల నిర్వహణ సంస్థలకు ఈ మొత్తం ఆదాయ వనరుగా ఉంటుంది. సెప్టెంబర్‌ 15, 2026న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన విధానం ప్రకారం, రూ.2,000కు మించిన అర్హత కలిగిన పర్సన్‌ టు మర్చంట్‌ (పీ2ఎం) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 పరిమితి విధించారు.

అయితే అన్ని వ్యాపార లావాదేవీలకూ ఈ ఛార్జీలు వర్తించవు. రూ.2,000లోపు యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఎండీఆర్‌ ఉండదు. నెలకు రూ.లక్ష వరకు యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు సంబంధించిన పీ2పీఎం విభాగానికీ జీరో ఎండీఆర్‌ కొనసాగుతుంది. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్‌ వంటి కీలక రంగాల్లో రూ.2,000కు మించిన అర్హత కలిగిన లావాదేవీలపై 0.4 శాతానికి బదులుగా స్థిరంగా రూ.5 ఛార్జీ విధించే నిబంధన ఉంది. మ్యూచువల్‌ ఫండ్లు, సెక్యూరిటీలు, స్టాక్‌ బ్రోకర్లు, డీలర్లకు సంబంధించిన చెల్లింపులపై 0.02 శాతం ఎండీఆర్‌, ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితి నిర్ణయించారు.

వినియోగదారులపై భారం ఉండదు

ఈ విధానంలో అత్యంత కీలకమైన అంశం సాధారణ వినియోగదారుల రక్షణ. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి జరిగే పర్సన్‌ టు పర్సన్‌(పీ2పీ) యూపీఐ లావాదేవీలన్నీ ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతాయి. వ్యాపారులకు చెల్లింపులు చేసే వినియోగదారుల నుంచి కూడా ఎండీఆర్‌ వసూలు చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. బ్యాంకులు, వ్యాపారులు ఈ ఛార్జీని వినియోగదారులకు బదిలీ చేయకుండా చూడాలని సూచించింది. అలాగే యూపీఐ యాప్‌లు ప్లాట్‌ఫామ్‌ ఫీజులు లేదా ఇతర ఛార్జీలు విధించకూడదని పేర్కొంది.

ఇదీ చదవండి: పసిడి ధర నేలచూపు.. వెండికీ తప్పని పతనం!

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)