Breaking News

యూట్యూబ్‌లో రాజ్ షమానీ ప్రపంచ రికార్డు!

Published on Tue, 11/17/2026 - 18:43

ప్రపంచ పాడ్‌కాస్టింగ్ విభాగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న దిగ్గజాలను వెనక్కి నెడుతూ భారతీయ యువ పారిశ్రామికవేత్త, పాడ్‌కాస్టర్ రాజ్ షమానీ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన నిర్వహిస్తున్న ‘ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ’ యూట్యూబ్ ఛానల్ 2.2 కోట్ల (22 మిలియన్లు) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన పాడ్‌కాస్ట్ హోస్ట్‌గా చరిత్ర సృష్టించింది.

ఇటీవల విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. యూట్యూబ్ పాడ్‌కాస్ట్ విభాగంలో ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న అంతర్జాతీయ హేమాహేమీలను రాజ్ షమానీ అధిగమించారు. ‘ది డైరీ ఆఫ్ ఏ సీఈఓ’ హోస్ట్ స్టీవెన్ బార్ట్‌లెట్ (2.19 కోట్ల సబ్‌స్క్రైబర్లు), ‘ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్’ సృష్టికర్త జో రోగన్ (2.12 కోట్ల సబ్‌స్క్రైబర్లు)లను వెనక్కి నెట్టి రాజ్ షమానీ మొదటిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాశ్చాత్య దేశాల గుత్తాధిపత్యం ఉండే ఆంగ్ల పాడ్‌కాస్టింగ్ విభాగంలో ఒక ఇండియన్‌ అగ్రస్థానానికి చేరడం డిజిటల్ కంటెంట్ చరిత్రలో కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇండోర్ నుంచి ప్రపంచ వేదిక దాకా..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణంలో ఒక చిన్న గదిలో 2021లో ‘ఫిగరింగ్ అవుట్’ ప్రస్థానం మొదలైంది. తొలినాళ్లలో సాధారణ ఇంటర్వ్యూలతో ప్రారంభమైన ఈ షో అనతికాలంలోనే వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, ఏఐ, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం వంటి లోతైన అంశాలపై చర్చించే మేధో వేదికగా రూపాంతరం చెందింది. కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా విజేతల ఆలోచనా సరళిని, వ్యాపార వ్యూహాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అందించడం ఈ కార్యక్రమం విజయ రహస్యం.

అంతర్జాతీయ అతిథులు

ఈ పాడ్‌కాస్ట్ గ్లోబల్ స్థాయికి ఎదగడంలో అతిథుల ఎంపిక కీలక పాత్ర పోషించింది. 2026లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ప్రముఖ న్యూరోసైంటిస్ట్ ఆండ్రూ హ్యూబర్‌మన్, ప్రొఫెసర్ స్కాట్ గాల్లోవే వంటి అంతర్జాతీయ ప్రముఖులు ఈ వేదికపై తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ ప్రభావంతో 2026 ఒక్క ఏడాదిలోనే ఈ ఛానల్‌కు ఏకంగా 80 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు తోడయ్యారు. ప్రస్తుతం అన్ని డిజిటల్ మాధ్యమాల్లో కలిపి నెలకు సుమారు 140 కోట్ల (1.4 బిలియన్లు) వ్యూస్‌ను ఈ ఛానల్‌ సాధిస్తోంది. విశేషమేమిటంటే మొత్తం సబ్‌స్క్రైబర్లలో 22 శాతం మంది విదేశీ ప్రేక్షకులే ఉండటం దీని అంతర్జాతీయ ఆదరణకు నిదర్శనం.

ఇదీ చదవండి: తండ్రికి నోటీసులు పంపిన కూతురు

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)