మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!
Breaking News
ఉబర్‌లో కొత్త సర్వీస్.. డ్రైవర్ లేకుండానే ప్రయాణం!
Published on Tue, 11/17/2026 - 07:10
టెక్నాలజీ పెరుగుతోంది.. డ్రైవర్ లేకుండానే ప్రయాణించే రోజులు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వినియోగం ఎక్కువవుతోంది. తాజాగా ఉబర్ కూడా రోబోటాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెజాన్‌కు చెందిన జూక్స్ కంపెనీ తయారు చేసిన రోబోటాక్సీలు ఇప్పుడు ఉబర్ యాప్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. నవంబర్ 16, 2026 నుంచి అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని టెక్ క్రంచ్ తన నివేదికలో వెల్లడించింది.
ఉబర్ యాప్‌లోనే బుకింగ్
సాధారణంగా ఉబర్ యాప్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నట్లుగానే.. రోబోటాక్సీలను కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే.. వీటికి డ్రైవర్ ఉండరు. పూర్తిగా అటానమస్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఈ వాహనాలు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తాయి.
సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ రంగంలో.. మరింత బలపడేందుకు ఉబర్ ఇప్పటికే 30కి పైగా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే.. ఫుట్‌పాత్‌పై నడిచే డెలివరీ రోబోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటాక్సీలు, డ్రోన్లకు సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఉత్తర అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో అటానమస్ వెహికిల్ టెక్నాలజీకి ప్రధాన వేదికగా ఎదగాలన్నది లక్ష్యంతో ఉబర్ అడుగులు వేస్తోంది.
ప్రారంభంలో ఉద్యోగులకు మాత్రమే
ప్రస్తుతం ఈ సేవలు లాస్‌వేగాస్‌లో ప్రారంభమైనప్పటికీ.. త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశముంది. జూక్స్ ఈ ఏడాది లాస్ ఏంజిల్స్‌లో కూడా రోబోటాక్సీ రైడ్‌లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రారంభంలో సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు మాత్రమే ఈ సేవలను అందించనుంది. ఆ తరువాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.
ఇదీ చదవండి: మౌనం వీడిన రతన్ టాటా సోదరుడు.. టాటా గ్రూప్‌లో కొత్త వివాదం!
అయితే.. లాస్ ఏంజిల్స్‌లో పూర్తిస్థాయి కమర్షియల్ సేవలు 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ఉబర్ యాప్ ద్వారా కూడా అక్కడ రోబోటాక్సీలను బుక్ చేసుకునే వీలుంటుందని సమాచారం. ప్రస్తుతానికి ఉబర్ ద్వారా జూక్స్ రోబోటాక్సీ సేవలు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో ఈ సేవలను ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై ఉబర్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Hey Atlanta, the Zoox robotaxi is here. 🍑👋 We’ve started driving around Northwest ATL and will expand our geofence later this year. Rides are limited to Zoox employees, family, and friends for now. Waitlist coming soon. Keep an eye out. 👀 Learn more: https://t.co/W7sWj696Z5 https://t.co/1vJFk5YPOF
— Zoox (@zoox) November 13, 2026
Tags : 1