Breaking News

63 ఫైనాన్స్‌ కంపెనీలు రద్దు.. ఆర్బీఐ కీలక నిర్ణయం

Published on Mon, 11/16/2026 - 17:02

దేశంలోని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) రిజిస్ట్రేషన్ల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 63 సంస్థలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను రద్దు చేసింది. వీటిలో 49 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ స్వయంగా రద్దు చేయగా, మరో 13 ఎన్‌బీఎఫ్‌సీలు, ఒక హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ) తమ రిజిస్ట్రేషన్లను సరెండర్‌ చేశాయి.

నవంబర్‌ 16న విడుదల చేసిన ప్రకటనలో ఆర్బీఐ ఈ వివరాలను వెల్లడించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ చట్టం, 1934లోని సెక్షన్‌ 45-ఐఏ (6) కింద 49 కంపెనీల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 2026 అక్టోబర్‌ 1 నుంచి 29 మధ్య జారీ అయ్యాయి.

మరోవైపు, రిజిస్ట్రేషన్లను సరెండర్‌ చేసిన 14 సంస్థల్లో ఆరు కంపెనీలు ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారం నుంచి వైదొలిగాయి. మరో ఐదు సంస్థలు ఆర్బీఐ నిర్దేశించిన నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ అవసరం లేని అన్‌రిజిస్టర్డ్‌ టైప్‌-1 ఎన్‌బీఎఫ్‌సీలుగా వర్గీకరణకు అర్హత సాధించాయి. మిగిలిన మూడు సంస్థలు విలీనం, రద్దు, స్వచ్ఛందంగా కంపెనీని మూసివేయడం వంటి కారణాలతో చట్టపరమైన ఉనికిని కోల్పోయాయి.

రిజిస్ట్రేషన్లను సరెండర్‌ చేసిన సంస్థల్లో మనీష్‌ సింథటిక్స్‌, అమర్‌ ప్లాజా అండ్‌ హోల్డింగ్స్‌, వికానిక్‌ వ్యాపార్‌, రైట్‌ ట్రెజర్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌, బ్రావో క్యాపిటల్‌ సర్వీసెస్‌, సీజీఆర్‌ మర్కంటైల్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి. అలాగే మనిభవ్నం హోమ్‌ ఫైనాన్స్‌ ఇండియా, సన్‌ సోర్స్‌ లీఫిన్‌, లియానర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థల రిజిస్ట్రేషన్లను అవి చట్టపరమైన సంస్థలుగా కొనసాగకపోవడంతో రద్దు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు రద్దయిన సంస్థలు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 45-I ప్రకారం ఎన్‌బీఎఫ్‌ఐ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుండదని కేంద్ర బ్యాంక్‌ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం.. చేతులు మారిన ఇళ్లు..

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)