Breaking News

ప్రకృతి అందాలకు కేరాఫ్‌.. ప్రపంచాన్ని ఆకట్టుకున్న స్విస్‌ గార్డెన్‌!

Published on Thu, 11/12/2026 - 13:47

పచ్చని చెట్లు.. రంగురంగుల పూలు.. పక్షుల కిలకిలసవళ్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలాంటి ప్రకృతి అందాల మధ్య కొద్దిసేపు గడిపితే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అలాంటి అందమైన ఉద్యానవనమే బ్రిటన్‌లోని స్విస్‌ గార్డెన్‌. తాజాగా 2026 ఏడాదికి గాను ఉత్తమ ఉద్యానవనంగా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది. రాయల్‌ హార్టికల్చరల్‌ సొసైటీ (RHS) నిర్వహించిన ‘పార్టనర్‌ గార్డెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పోటీలో ప్రజల ఓట్లతో విజేతగా నిలిచింది.

బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌ ప్రాంతంలో ఓల్డ్‌ వార్డెన్‌ పార్క్‌లో ఈ ఉద్యానవనం ఉంది. రీజెన్సీ కాలం నాటి స్విస్‌ పిక్చరెస్క్యూ, ఆల్పైన్‌ శైలుల్లో దీనిని తీర్చిదిద్దారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ తోటలో ప్రకృతి అందాలతో పాటు ప్రత్యేకమైన నిర్మాణ శైలి సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఆర్‌హెచ్‌ఎస్‌ భాగస్వామ్య ఉద్యానవనాల పథకంలో భాగంగా సభ్యులు కొన్ని నిర్ణీత రోజుల్లో ఉచితంగా సందర్శించే అవకాశం ఉంది.

ఈ అవార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని షటిల్‌వర్త్‌ గార్డెన్‌ ప్రధాన నిర్వాహకుడు టోనీ యంగ్‌ తెలిపారు. తమ తోటను ఇష్టపడుతూ.. ఓట్లు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా వాలంటీర్ల కృషి వల్లే ఉద్యానవనం ఇంత అందంగా ఉందని పేర్కొన్నారు. వారి అంకితభావం వెలకట్టలేనిదని వారు ప్రశంసించారు.

వన్యప్రాణులకు ఆవాసం..
స్విస్‌ గార్డెన్‌ అందాలకే కాదు.. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ మొక్కల పెంపకంలో మట్టిని ఎక్కువగా తవ్వకుండా ‘నో డిగ్‌’ పద్ధతిని అనుసరిస్తున్నారు.

సేంద్రియ ఎరువులను పరిమితంగా వినియోగిస్తున్నారు. ఎండిన ఆకులు, కొమ్మలతో కీటకాలు, ముళ్లపందులకు సహజ ఆవాసాలు కల్పిస్తున్నారు. చెరువులను నీటి పక్షులకు అనువైన నివాసాలుగా నిర్వహిస్తున్నారు. తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షించే మొక్కలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. పక్షులు గూళ్లు కట్టే సమయంలో చెట్లను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు.

మానసిక ఆరోగ్యానికీ మేలు..
ఈ ఎస్టేట్‌లో 1909 నుంచి 1950ల మధ్య తయారైన పాత విమానాల సేకరణతో పాటు విక్టోరియన్‌ కాలం నాటి భవనం కూడా సందర్శకులను ఆకట్టుకుంటాయి. తోటల్లో గడపడంతో ప్రకృతితో మమేకమయ్యే అవకాశం లభిస్తుందని, ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని RHS ఉద్యానవనాల డైరెక్టర్‌ డాక్టర్‌ టిమ్‌ అప్సన్‌ తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో ఇలాంటి ఉద్యానవనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అరవై ఏళ్ల అక్షర సేద్యం

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)