Breaking News

మత్తు వదలరా?

Published on Wed, 11/11/2026 - 04:29

‘నావాళ్లతో పాటు అందరూ బాగుండాలి’ అనేది స్ఫూర్తిదాయకమైన మాట. సమాజానికి మేలుచేసే మాట. అయితే ఈ బాటలో ప్రయాణించేవారు అతి కొద్దిమంది. వారిలో ఒకరు... ఐ. విజయలక్ష్మి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతున్న 62 ఏళ్ల విజయలక్ష్మి ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేస్తున్నారు. ఇది సాహస యాత్ర కాదు. సామాజిక స్పృహతో కూడిన యాత్ర. ‘సే నో టు డ్రగ్స్‌’ అని యువతరంతో ప్రతిజ్ఞ చేయిస్తున్న విజయలక్ష్మి పరిచయం... ఆమె మాటల్లోనే...
 
నా స్వస్థలం ఏలూరు జిల్లాలోని నారాయణపురం. గత ఏడేళ్లుగా హైదరాబాద్‌లోని నా కూతురు దగ్గరే ఉంటున్నాను. ఒకరోజు న్యూస్‌ పేపర్‌లో ఒక వార్త చదివాను. గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఒక బడ్డీ కొట్టును ఈగల్‌ అధికారులు మూసివేసినా కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఆ బడ్డీ కొట్టు దగ్గరే తచ్చాడుతూ డ్రగ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారంటూ ఆ న్యూస్‌లో రాసి ఉంది. అది చదివిన తర్వాత నాకు ఎంతో బాధ కలిగింది. నా మనవడు ఒక్కడే బాగుంటే సరిపోదు. ఈ మత్తుమహమ్మారి బారిన పడకుండా మిగిలిన పిల్లలను కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాను.

ప్రతిజ్ఞ... దేశవ్యాప్తంగా కనీసం లక్షమంది విద్యార్థులను కలిసి మత్తుపదార్థాలతో ఎదురయ్యే చెడును వివరించాలనే లక్ష్యంతో సైకిల్‌యాత్ర మొదలు పెట్టాను. ఎక్కడికి వెళ్లినా విద్యార్థులతో, తల్లిదండ్రులతో ‘సే నో టు డ్రగ్స్‌’ అని ప్రతిజ్ఞ చేయిస్తున్నాను. అది కూడా నామీద ఒట్టుపెట్టి ఈ ప్రతిజ్ఞ చేయాలని చెబుతున్నాను. ఇలా ఈ అమ్మమ్మను చూసి మరికొందరు అమ్మలు, నాన్నలు.. మిగిలిన అందరూ స్ఫూర్తి పొంది డ్రగ్స్‌ మహమ్మారిని తరిమి కొడతారన్న ఆశ నాది. 

దేశవ్యాప్తంగా...  కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా దేశం మొత్తం చేయాల్సిన యాత్ర ఇది అనిపించింది. నా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు సైకిల్‌యాత్ర చేయాలని సంకల్పం తీసుకున్నాను. స్వచ్ఛభారత్‌ సాధన లక్ష్యంతో 2017లో ఇచ్చాపురం నుంచి తడ వరకు సైకిల్‌ యాత్ర చేశాను. ఆ అనుభవం ఢిల్లీ వరకు సైకిల్‌ యాత్ర చేయాలనుకోవడానికి ఊతమైంది. 

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సైకిల్‌ యాత్ర. అదీ దాదాపు మూడువేల కిలోమీటర్ల యాత్ర అంటే మాటలు కాదు. అందుకే నేను గత మూడు నెలలుగా రోజుకు 70 కిలోమీటర్లు సైక్లింగ్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అలా నాకు నమ్మకం వచ్చిన తర్వాత సైకిల్‌ యాత్రకు సిద్ధమయ్యాను. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో భీమవరంలోని ఆయన విగ్రహం నుంచి నా సైకిల్‌ యాత్రను అక్టోబర్‌ 22 న మొదలు పెట్టాను  ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ గుండా డిసెంబర్‌ 10 వరకు ఢిల్లీకి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. రోజుకు సరాసరిన 70 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేస్తున్నాను. కుటుంబ సభ్యులు వారించారు. కొంతమంది హేళన చేశారు. కానీ నేను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. దానికోసం వయస్సుతో సంబంధం లేకుండా ముందుకు వెళుతున్నాను.

– నాగోజు సత్యనారాయణ, క్రైం రిపోర్టర్, సాక్షి స్టేట్‌ బ్యూరో, హైదరాబాద్‌
ఫొటోలు: నోముల రాజేష్‌ రెడ్డి

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)