Breaking News

నేడు బ్యాంకులకు సెలవు.. ఈ 7 రాష్ట్రాల్లో క్లోజ్!

Published on Mon, 11/09/2026 - 08:08

బ్యాంకులో ఏదైనా పని ఉందా?, అయితే ఒకసారి ఈ విషయం తెలుసుకోండి. నవంబర్ 9, సోమవారం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన్ పూజ, విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 9న త్రిపుర, మధ్యప్రదేశ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు చండీగఢ్‌లో బ్యాంకు శాఖలు మూసివేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పండుగల నేపథ్యంలో ఈ సెలవు ఇచ్చారు.

అగర్తలా, భోపాల్, చండీగఢ్, గ్యాంగ్‌టక్, గువాహటి, ఇంఫాల్, జైపూర్, కాన్పూర్, లక్నో, రాయ్‌పూర్‌లోని RBI ప్రాంతీయ కార్యాలయాలు కూడా మూసివేయనున్నట్లు సమాచారం.

ఏపీ, తెలంగాణలో బ్యాంకులు పనిచేస్తాయా?
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. నవంబర్ 9న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్యాంకులకు సెలవు లేదు. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా రెండు రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖలు సాధారణ పని వేళల్లో పనిచేయనున్నాయి. అలాగే.. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లోనూ నవంబర్ 9న బ్యాంకులు తెరిచే ఉంటాయి.

మహారాష్ట్రలో నవంబర్ 10న సెలవు
మహారాష్ట్రలో నవంబర్ 9న బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. అయితే.. నవంబర్ 10న దీపావళి (బలి ప్రతిపద), గోవర్ధన్ పూజ, లక్ష్మీ పూజ, విక్రమ సంవత్ నూతన సంవత్సరం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది. దీంతో రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవుల తేదీలు మారుతున్నాయి.

బ్యాంకు శాఖలు మూసివేసినా ఖాతాదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు కూడా తీసుకోవచ్చు. అయితే.. బ్యాంకు శాఖల్లో నేరుగా చేయాల్సిన పనులు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలకు ఆలస్యం కావచ్చు.

ఇదీ చదవండి: 'క్షమించండి.. ఆమెతో వివాహేతర సంబంధం నిజమే': ఎన్విడియా సీఈఓ

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)