HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్‌.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు!

Published on Sat, 11/07/2026 - 16:43

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) చేసేవారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీపి కబురు అందించింది. ఎంపిక చేసిన కాలపరిమితుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.3 కోట్లలోపు చేసే ఎఫ్‌డీలకు సంబంధించి సవరించిన రేట్లు నవంబర్ 4, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. కొన్ని కాలపరిమితులపై గరిష్ఠంగా 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) మేర వడ్డీ పెరిగింది. తాజా మార్పులతో సాధారణ ఖాతాదారులు గరిష్ఠంగా 6.60 శాతం, సీనియర్ సిటిజన్లు 7.20 శాతం వడ్డీ పొందవచ్చు.

సాధారణ ఖాతాదారులకు ఎంత వడ్డీ?

61 రోజుల నుంచి ఆరు నెలల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 4.25 శాతం నుంచి 4.75 శాతానికి పెంచింది. మూడేళ్లకు పైబడి పదేళ్ల వరకు చేసే డిపాజిట్లపై గరిష్ఠంగా 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో ఈ దీర్ఘకాలిక డిపాజిట్లపై గరిష్ఠ రేటు 6.15 శాతంగా ఉండేది. అయితే 60 రోజుల వరకు ఉండే డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.

సీనియర్ సిటిజన్లకు మరింత ప్రయోజనం

వృద్ధులకు కూడా బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. 61 రోజుల నుంచి ఆరు నెలల లోపు డిపాజిట్లపై 4.75 శాతంగా ఉన్న వడ్డీని 5.25 శాతానికి చేర్చింది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు చేసే ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.20 శాతం వడ్డీ అందిస్తోంది. ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇతర బ్యాంకుల్లోనూ వడ్డీ రేట్ల సవరణ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా ఇటీవల ఎంపిక చేసిన కాలపరిమితుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు డిపాజిట్ కాలపరిమితి, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, పన్నుల అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇదీ చదవండి: దీపావళి బోనస్ వచ్చిందా? ఇలా చేస్తే బెస్ట్‌!

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)