ఒక్కరోజే లక్ష కార్లు.. రూ.12 వేల కోట్లు!

Published on Sat, 11/07/2026 - 08:45

పండుగల సీజన్ వచ్చిందంటే.. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ధన్‌తేరస్ రోజున బంగారం, వెండి మాత్రమే కాకుండా.. కార్లు వంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు. అందుకే.. ఈ రోజున వాహనాలు కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుగానే బుకింగ్స్ చేసుకుంటారు.

ఈ ఏడాది కూడా ధన్‌తేరస్ సందర్భంగా.. కార్ల అమ్మకాలు భారీగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజే దాదాపు లక్ష కార్లు డెలివరీ అయినట్లు ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటి విలువ సుమారు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఏడాది కార్ల డెలివరీలు.. గతేడాది మాదిరిగానే ఉన్నాయని పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కార్లకు మంచి డిమాండ్ కనిపించగా, దక్షిణాది మార్కెట్లలోనూ అమ్మకాలు నిలకడగా సాగాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త కార్లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కారు ధర సగటున రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండటంతో.. ఒక్కరోజు అమ్మకాల విలువ భారీగా నమోదయ్యే అవకాశం ఉంది.

ఇక ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. ఈ ధన్‌తేరస్ రోజున సుమారు 30 వేల కార్లను డెలివరీ చేయాలని భావిస్తోంది. గతేడాది ధన్‌తేరస్ రెండు రోజుల్లో కంపెనీ సుమారు 51 వేల కార్లను డెలివరీ చేసింది. మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా.. ఈసారి అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. ధన్‌తేరస్ సందర్భంగా దాదాపు 16 వేల కార్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే సుమారు 14 శాతం ఎక్కువ కావడం విశేషం.

టాటా మోటార్స్ కూడా ఈ పండుగ సీజన్‌లో మంచి అమ్మకాలను ఆశిస్తోంది. ధన్‌తేరస్ ఒక్కరోజే 12 వేలకుపైగా కార్లను డెలివరీ చేయాలని కంపెనీ అంచనా వేస్తోంది. దీపావళి సందర్భంగా శుభ ముహూర్తాల్లో కార్ల డెలివరీలు బుధవారం వరకు కొనసాగనున్నాయి. దీంతో.. రాబోయే రోజుల్లో కూడా కొనుగోళ్ల జోరు కొనసాగుతుందని కార్ల కంపెనీలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: ప్రయాణికుడిని ఎక్కించుకోకుండా వెళ్లిన ప్రైవేట్ బస్సు.. ట్రావెల్స్ సంస్థకు షాక్!

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)