Breaking News

సంగీతకారుల్లో గాయాలు... వాటి గుర్తింపు, వైద్యపరీక్షలూ, చికిత్సలపై

Published on Sun, 11/01/2026 - 17:30

సంగీతకారుల్లో గాయాలు... వాటి గుర్తింపు, వైద్యపరీక్షలూ, చికిత్సలపై

విలక్షణ పుస్తకం
వృత్తిపరమైన సమస్యలు (ప్రొఫెషనల్‌ హజార్డ్స్‌) అనేవి కేవలం కొంతమంది ప్రొఫెషనల్స్‌లోనూ లేదా క్రీడాకారుల్లోనూ కనిపిస్తాయనేది పాపులర్‌ అభిప్రాయం. కానీ చాలామందికి తెలియని అంశం ఏమిటంటే... సంగీతకారులకూ (మ్యూజీషియన్స్‌కూ) అలాంటి గాయాలే అవుతుంటాయి.సాధారణంగా క్రీడాకారులకు ఆటల్లో తగిలే దెబ్బలు, వారికి వచ్చే కీళ్లకు సంబంధించిన సమస్యలపై కొన్ని పుస్తకాలు వచ్చాయి. కానీ... సంగీతకారులకు వచ్చే వృత్తిపరమైన సమస్యలపై పుస్తకాలు దాదాపుగా రాలేదనే చెప్పాలి. 

ఇలా సంగీతకారులు గాయాల పాలవ్వడానికి అనేక  కారణాలుంటాయి. వేళ్ల కదలికలను పదేపదే రిపీట్‌ చేయడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం లేదా నిలబడటం, ప్రదర్శనల సమయంలో ఎదురయ్యే ఒత్తిడుల వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. సంగీతకారుల్లో వచ్చే ఈ గాయాల గురించీ, వాటిని గుర్తించడమూ, చికిత్స అందించడం గురించి ‘ఇంజూరీస్‌ ఇన్‌ మ్యూజీషియన్స్‌: ఇమేజింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌’ పుస్తకం వివరిస్తుంది. 

ఈ పుస్తకం తొలి అధ్యాయాల్లో ప్రపంచంలోని వివిధ సంగీత సంప్రదాయాలు, చరిత్ర, సంగీతవాద్యాల వర్గీకరణ గురించి వివరించారు. గాత్రంతో పాటలు పాడేవారిలో, వాద్య పరికరాలు వాయించేవారిలో వచ్చే గాయాలు, వాటికి కారణాలు, శరీరంలో జరిగే మార్పులు, రేడియాలజీ పరీక్షల్లో కనిపించే లక్షణాలను కూడా చర్చించారు. తర్వాతి అధ్యాయాల్లో సంగీతకారుల్లో కనిపించే శరీర భంగిమల లో΄ాలు, సంగీత వాద్యాలను ప్లే చేసేప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు, వాటివల్ల వచ్చే ఎముకలు, కండరాలు, కీళ్ల సమస్యలను ఆర్థోపెడిక్‌ కోణంలోనూ వివరించారు.

సాధారణంగా పాశ్చాత్యరంగంలో సంగీత కళాకారులు కూర్చీల్లో కూర్చుని లేదా నిలబడి కళా ప్రదర్శన ఇస్తుంటారు. అయితే మన దేశ శాస్త్రీయ సంగీత కళాకారులు మాత్రం సాధారణంగా వేదికపై కింద కూర్చుని కచేరీలు చేస్తారు. ఇలా గంటల తరబడి కదలకుండా ఒకే భంగిమలో కూర్చోవడం, దశాబ్దాల పాటు ఇలా కచేరీలు ఇవ్వడం వల్ల వృత్తిపరమైన సమస్యల్లాంటివి వచ్చి కండరాలూ, కీళ్లకు సంబంధించిన అనేక సమస్యలకూ, రుగ్మతలకు గురవుతుంటారు. 

అయితే ఈ సంగీత కళాకారులకు వచ్చే సమస్యలన్నీ ఒకేలా ఉండవు. గాత్ర (ఓకల్‌) కళాకారులకు ఒకలాంటి సమస్యలు వస్తే... వీణా, వయొలిన్, వేణువు, నాదస్వర కళాకారులకు వచ్చే సమస్యలు వేరు. అలాగే మృదంగం, తబలా, డోలు వాద్యకారులకు వచ్చే సమస్యలు మరింత భిన్నంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ శాస్త్రీయంగా వివిధ కోణాలతో పాటు వైద్యశాస్త్రపరంగా కూడా కూలంకషంగా పరిశీలించి పుస్తకాన్ని రాశారు. కేవలం పుస్తక పరిజ్ఞానంతో కాకుండా... వైద్యశాస్త్ర విజ్ఞానంతోపాటు స్వీయ అనుభవం ్ర΄ాతిపదికగా రాయడం వల్ల ఈ రచన శాస్త్రీయతనూ, మరింత ప్రామాణికతనూ సంతరించుకుంది. 

ఈ పుస్తకాల ప్రధాన రచయిత విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ భమిడిపాటి కనకదుర్గాప్రసాద్‌. ఆయన వృత్తిరీత్యా రేడియాలజిస్ట్‌ అయినప్పటికీ ప్రవృతి రీత్యా కర్ణాటక సంగీతంలో మంచి వైణికుడు కూడా. తన వీణావాదనతో గత నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో కచేరీలు చేసిన అనుభవం ఆయన సొంతం. సంగీతజ్ఞుడిగా తన సహ కళాకారులకు వచ్చే సమస్యలూ, వాటికి చికిత్స చేసిన అనుభవమూ ఉంది. ఆ అనుభవాలతోనే ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. 

ఈ కృషిలో ఆయనకు ప్రధానంగా తోడ్పడినవారు ఇద్దరు. ఒకరు వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రవృత్తి రీత్యా సంగీతకారులైన వీణాధరి భమిడి΄ాటి. ఇక వీరిలో మరొకరు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన ప్రముఖ మస్క్యులో స్కెలిటల్‌ రేడియాలజిస్ట్‌ బి. రాజేశ్‌. విజయనగరానికి చెందిన ఆయన పియానో వాదనలో నిష్ణాతులు. ఇలా ఈ ముగ్గురి మేలు కలయికతో ఈ పుస్తకం వెలువడింది. వైద్యపరమైన అంశాలను మరింత తేలిగ్గా అర్థం చేసుకునేందుకు అనేక చిత్రాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. సంగీతకారులకు చికిత్స అందించే రేడియాలజిస్టులు, ఆర్థోపెడిక్‌ సర్జన్లు, ఫిజియోథెరపిస్టులతో పాటు ఇతర వైద్యులకూ ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరం.  

సంగీతమూ, వైద్య రంగాల మధ్య సంబంధంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పుస్తకం ఎంతోప్రాధాన్యం సంతరించుకుంది. సంగీతకారులకు చికిత్స అందించే వైద్యులు, రేడియాలజిస్టులు, వైద్యనిపుణులూ, పునరావాస నిపుణులకు ఇది ఉపయోగకరమైన మార్గదర్శిగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ పుస్తకం ‘అమెజాన్‌’లో లభిస్తోంది.  

యాసీన్‌

ఇదీ చదవండి: నెల నెల విల విల..సివియర్‌గా ఉంటే నిర్లక్ష్యం వద్దు..!

#

Tags : 1

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)