Breaking News

దేశంలోనే తొలిసారి.. మొదటి ప్రభుత్వ ప్రోటాన్ థెరపీ సెంటర్

Published on Sun, 11/01/2026 - 12:57

క్యాన్సర్ సంరక్షణ (క్యాన్సర్ కేర్) విభాగంలో అస్సాం ప్రభుత్వం చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికింది. దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ప్రోటాన్ బీమ్ థెరపీ సెంటర్’ ఏర్పాటుకు అస్సాం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును గౌహతి మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.

అత్యాధునిక సాంకేతికత

ఈ సెంటర్ ఏర్పాటు కోసం అస్సాం ప్రభుత్వం రేడియోథెరపీ సాంకేతికతలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెల్జియం సంస్థ ‘ఐఓఎన్‌ బీమ్‌ అప్లికేషన్స్‌’ (ఐబీఏ)తో ఒప్పందం కుదుర్చుకుంది. అత్యంత కచ్చితత్వంతో పనిచేసే 'ప్రొటీయస్ వన్' అనే అధునాతన ప్రోటాన్ థెరపీ వ్యవస్థను ఈ కేంద్రంలో అందుబాటులోకి తేనున్నారు. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో, ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పరిమితమైన ఈ సాంకేతికతను ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి స్వీకరించడం దేశంలోనే ఇది మొదటిసారి.

రూ.600 కోట్ల ప్రాజెక్టు వ్యయం

ఈ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయంలో ప్రపంచ బ్యాంక్ రుణం రూ.315 కోట్లుకాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.285 కోట్లుగా ఉంది. ప్రధాన యంత్రాల కొనుగోలు, మౌలిక వసతుల నిర్మాణం, వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బందికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వడం వంటివి ఈ వ్యయంలో కలసి ఉంటాయి.

ప్రోటాన్ థెరపీ ప్రత్యేకత ఏమిటి?

సాంప్రదాయ రేడియేషన్ థెరపీలతో పోలిస్తే ప్రోటాన్ బీమ్ థెరపీ అత్యంత సురక్షితమైనది, కచ్చితమైనది. ఇందులో క్యాన్సర్ కణితి ఉన్న భాగానికి మాత్రమే అధిక తీవ్రత కలిగిన ప్రోటాన్ రేడియేషన్‌ను పంపుతారు. కణితి చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన అవయవాలకు ఎలాంటి హాని కలగదు. బ్రెయిన్, వెన్నుపాము, కళ్లు, చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ల చికిత్సలో ఇది ఒక కీలకంగా ఉంటుంది.

ఇదీ చదవండి: బంగారం చిన్నబోతోందెందుకో తెలుసా?

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)