Breaking News

టీసీఎస్‌ ఉద్యోగాన్ని కాదని..చీరల వ్యాపారం! ఏకంగా రూ. 12 కోట్లు..

Published on Sat, 10/31/2026 - 12:52

ఒక్కోసారి మన అభిరుచి ఎంత పెద్ద సాహసానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. అందరూ ఆశ్చర్యపోయేలా సక్సెస్‌ని అందుకునేలా చేస్తుంది. అయితే అందుక కాసింత ఓపిక, సంయమనం అవసరం. అవి ఉంటే..నచ్చిన అభిరుచితో అద్భుతాలు సృష్టించొచ్చు. ఇక్కడ ఈ మహిళా అలానే విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది. 

ఆ మహిళే..రమ్య దేవనాథన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో 18 ఏళ్లు పనిచేసిన తర్వాత రమ్య దేవనాథన్‌ కార్పొరేట్‌ జీవితాన్ని విడిచిపెట్టి..తనకిష్టమైన చీరల వ్యాపారం చేయాలనుకుంది. ఆమె చీరలంటే మహా ఆసక్తి. వాటిలోని పలు రకాల చీరలు, నాణ్యతలపై మంచి పట్టు ఉందామెకు. ఆ అభిరుచే సాఫ్ట్‌వేర్‌ కొలువుకి స్వస్తి పలికి చీరల వ్యాపారం చేసేలా చేసింది. అలా 2021లో రూ. 2 లక్షల ప్రారంభ పెట్టుబడితో మద్రాస్‌ చీరలను ప్రారంభించారు. 

ఆమె సరిగ్గా కరోనా టైంలో ‍ప్రారంభించడంతో..అప్పుడు అంత డిజటల్‌ షాపింగ్‌లే చేసేవారు. దాంతో తన చీరల వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంని ఉపయోగించుకోక తప్పదని గ్రహించింది. అలా తన చీరల వ్యాపారానికి సాంకేతికతను జోడించింది. ఆమెకు సాంప్రదాయ రిటైల్ నేపథ్యం లేని రంగంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, టెక్నాలజీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌పై ఉన్న పరిచయం ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారాన్ని నిర్మించడానికి పునాది వేసింది. 

నిజానికి రమ్య ప్రారంభంలో తన మద్రాస్ శారీస్‌ని సుమారు 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న ఒక చిన్న గది నుంచి తన కార్యకలాపాలను నిర్వహించేది. ఆర్డర్‌లను వాట్సాప్ ద్వారా నిర్వహించగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఈ వ్యాపారాన్ని మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేలా చేశాయి. ఆమె మొట్టమొదటగా వైబ్‌సైట్‌ లేదా మరింత అధునాతన సాంకేతిక మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. ఒక కొత్త వ్యాపారం నుంచి ఆన్‌లైన్‌లో చీరలు కొనడానికి కస్టమర్లు సుమఖంగా ఉంటారా లేదా అని నిర్థారించుకోవడానికి తనే కెమెరా ముందు నిలబడి ఆ చీర విశేషాలు గురించి వివరించేది. 

కస్టమర్లు చీర రంగు, డిజైన్‌కి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దాని గురించి చాలా వివరణాత్మకంగా ఉండేలా చూసుకునేది. అలాగే మొదట తన వ్యాపారం బాగా నిలదొక్కుకోవాలంటే..తన బ్రాండ్‌కి ముఖంగా ఉండాలని డిసైడ్‌ అయ్యింది. అలా ఆమె ఆన్‌లైన్‌ రిటైల్‌ కార్యకలాపాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువ దృష్టిపెట్టింది. ఆర్డర్‌ ప్రాసెసింగ్‌తో సహా మొత్త మానవీయంగా నిర్వహించడంలో ఉండే ఇబ్బందులను కూడా అంచనా వేసింది. అలాగే కస్టమర్లకు చేరువ​య్యేలా సంబంధాలను నెరుపుకునేందుకు సామాజిక మాధ్యమాల సాయం తీసుకుంటూ ముందుకు సాగింది. 

అలాగే భారీ ప్రకటనల కంటే కస్టమర్‌ సంతృప్తే..తనను మరింత మంది వినియోగదారులను అందించే ‍ప్రచార సాధనంగా మారిందని అంటుంది రమ్య. ఆ అంశానికే ప్రాధాన్యత ఇవ్వడంతోనే..తన బ్రాండ్‌ చూస్తుండగానే లాభాల బాటపట్టిందని అంటోంది. ప్రస్తుతం ఆమె మద్రాస్‌ చీరల వ్యాపారం ఏడాదికి రూ. 12 కోట్లు టర్నోవర్‌ ఆర్జిస్తోంది. 

ఈ ఏడాది మాత్రం ఏకంగా రూ. 22 కోట్ల ఆదాయన్ని ఆర్జించినట్లు సమాచారం. ఏ వ్యాపారమైన కస్టమర్‌ నమ్మకాన్ని పొందినప్పుడే సక్సెస్‌ అవుతుందని, అందుకే ఆ విషయంలో తాను నిజాయితీగా వ్యవహరించేద్దాన్ని అంటోంది. అదే ఇవాళ ఒక బ్రాండ్‌గా స్థిరపడి..కోట్లు ఆర్జిస్తోందని ఓ ఇంటర్వూలో రమ్య దేవనాథన్‌ సంతోషంగా పేర్కొంది. 

ఇదీ చదవండి: స్టీమ్‌ రూమ్‌లో కొందరికి రక్తపోటు తగ్గతుంది ఎందుకు? నటి జాన్వీ కపూర్‌ కూడా..
 

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)