Breaking News

బెండైపోతున్నారా? సింపుల్‌గా ఇలా నిటారవ్వండి!

Published on Sat, 10/31/2026 - 12:31

నేటి ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల వెన్నెముక వంగిపోవడం, భుజాలు ముందుకు చొచ్చుకురావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ శరీర భంగిమ లోపాలను సరిదిద్దడానికి, కండరాలను బలోపేతం చేయడానికి కొన్ని సులభమైన వ్యాయామాలు ఎంతగానో దోహదపడతాయి. వీటిని క్రమం తప్పకుండా చేయడం ద్వారా వెన్ను నొప్పులను దూరంగా ఉంచుకోవచ్చు.

గడ్డాన్ని వెనక్కు లాగడం..
కుర్చీలో నిటారుగా కూర్చోవడం లేదా నిలబడడం ద్వారా ఈ వ్యాయామాన్ని ప్రారంభించవచ్చు. గడ్డాన్ని కిందికి వంచకుండా, నెమ్మదిగా వెనక్కి లాగుతూ మెడ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఈ భంగిమను కొన్ని సెకన్ల పాటు ఉంచి సాధారణ స్థితికి రావాలి. తల ముందుకు వంగే అలవాటును తగ్గించడానికి, మెడ సరైన స్థితిలో ఉండటానికి ఇది బాగా సహాయపడుతుంది.

ఛాతీని తెరిచి విశ్రాంతి
రెండు భుజాలను నెమ్మదిగా వెనక్కి తీసుకెళ్లి, ఛాతీని ముందుకు తెరిచి వెన్నును నిటారుగా ఉంచడం ఈ వ్యాయామం ప్రధాన విధానం. అయితే భుజాలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా చేయాలి. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల భుజాలలో ఏర్పడే బిగుతును తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

పైవెన్ను, పొట్ట కండరాలు
నిటారుగా ఉన్నప్పుడు భుజాలను పైకి ఎత్తకుండా వెనక్కి లాగి, రెండు భుజాల మధ్యనున్న కండరాలను కొన్ని సెకన్ల పాటు బిగించాలి. దీనితో పాటు మోకాళ్లను వంచి నేలపై పడుకుని పొట్ట కండరాలను బిగించడం ద్వారా కోర్‌ (పొట్ట కండరాలు, నడుము, దిగువ వెన్ను కండరాలు, తుంటి, పిరుదుల కండరాలు, పెల్విక్‌ ఫ్లోర్‌ కండరాలు) బలాన్ని పెంచుకోవచ్చు. పొట్ట కండరాలు బలంగా ఉంటే వెన్నుపూసకు మెరుగైన ఆధారం లభిస్తుంది.

పని మధ్యలో విరామాలు
ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా తరచుగా లేచి కొద్దిసేపు నడవడం, భుజాలను తిప్పడం వంటివి చేయాలి. స్క్రీన్‌ను కంటి స్థాయిలో ఉంచుకోవడం ముఖ్యం. ఈ వ్యాయామాల వల్ల శరీర భంగిమ మెరుగుపడడమే కాకుండా, మెడ, భుజాలు, వెన్నుపై ఒత్తిడి తగ్గి కండరాల బలం పెరుగుతుంది. ఇవి నెమ్మదిగా నొప్పిలేకుండా చేయాలి, తీవ్రమైన నొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలి.
– సాక్షి స్పెషల్‌ డెస్క్‌

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)