Breaking News

బాల రాక్షసులకు బతుకు పాఠాలు నేర్పేదెవరు?

Published on Sat, 10/31/2026 - 12:06

బడి అంటే అక్షరాలు దిద్దించే సరస్వతీ నిలయం.. చిన్నారుల ముద్దుముద్దు మాటలతో, ఆటపాటలతో విరిసే పవిత్ర ప్రదేశం. కానీ, నేడు అదే పాఠశాల గదులు రక్తసిక్తమవుతున్నాయి. అభం శుభం తెలియని పసికూనలపై సహచర విద్యార్థులే కిరాతక దాడులకు తెగబడుతుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. హరియాణాలోని పంచకులలో తాజాగా వెలుగుచూసిన సంఘటన విద్యా వ్యవస్థలోని లోపాలను, బాలల మానసిక వికాసంలో వస్తున్న ప్రమాదకర మార్పులను ఎత్తిచూపుతుంది.

నివ్వెరపరిచే నిజాలు!

హరియాణాలోని పంచకుల సెక్టార్-20లో ఉన్న సంస్కృతి మోడల్ స్కూల్‌లో తాజాగా చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కేజీ చదువుతున్న ఒక చిన్నారిపై, అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇటుక రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలుడు విసిరిన దెబ్బలకు ఆ పసిపాప తీవ్ర రక్తగాయాలతో స్పృహ కోల్పోవడంతో వెంటనే చండీగఢ్‌లోని పీజీఐ ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల ద్వారా బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగింది.

ఆంధ్రప్రదేశలోని అనంతపురం జిల్లాలో ఓ ఉన్మాది పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొంతు కోసిన ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ రెండు ఘటనలు కేవలం విద్యార్థుల మధ్య జరిగిన గొడవలు మాత్రమే కావు.. సమాజంలో, పిల్లల మనస్తత్వాల్లో రూపుదిద్దుకుంటున్న తీవ్రమైన విపరీత మానసిక ధోరణికి సజీవ సాక్ష్యాలు.

పంచకుల ఘటనలో క్లాస్‌రూమ్‌ల్లో విద్యార్థుల భద్రతకు కనీస పూచీకత్తు లేకపోవడం, పాఠశాలల పర్యవేక్షణ లోపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నప్పటికీ జరిగిన నష్టాన్ని, చిన్నారి అనుభవించిన నరకాన్ని పూడ్చడం సాధ్యమా?

చిన్నారుల్లో ఈ మనస్తత్వానికి కారణాలేంటి?

చిన్న వయసులోనే పిల్లలు ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి బహుళ కారణాలు ఉన్నాయని విద్యావేత్తలు, మానసిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

డిజిటల్ హింస: ఆధునిక యుగంలో పిల్లల చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు చేరాయి. రక్తపాతం, హత్యలు, దాడులు ఉండే ఉద్వేగభరితమైన ఆన్‌లైన్ వీడియో గేమ్స్, సోషల్ మీడియా రీల్స్, ఇటీవల వస్తున్న కొన్ని సినిమాలు పిల్లలను హింస పట్ల ఆసక్తి కలిగించేలా చేస్తున్నాయి.

పెంపకంలో లోపాలు: ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవలు, గృహహింస లేదా పిల్లలను విపరీతంగా కొట్టడం/అరిచే వాతావరణం ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆ ప్రవర్తననే అనుకరిస్తారు.

ఆవేశాన్ని నియంత్రించుకోలేకపోవడం: కోపం, నిరాశ, లేదా భయం కలిగినప్పుడు దాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక అకస్మాత్తుగా తీవ్రమైన భౌతిక దాడులకు తెగబడతారు.

మానసిక ఆరోగ్య పర్యవేక్షణ లేకపోవడం: పాఠశాలలు నిత్యం వారి మార్కులపైనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తుంటాయి. విద్యార్థులు అనుభవిస్తున్న ఒత్తిడిని, మానసిక సమస్యలను గుర్తించే కౌన్సెలర్లు ఎక్కువ శాతం పాఠశాలల్లో లేకపోవడం పెద్ద లోపం.

మార్పు ఎక్కడ రావాలి? మార్గాలు ఏమిటి?

ఈ విపరీత ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే కేవలం పోలీసు కేసులతో సరిపోదు. ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజూ కొద్దిసేపైనా సమయం కేటాయించి మాట్లాడాలి. వాటి మాట తీరును పరిశీలించాలి. పాఠశాలలో వారి అనుభవాలు, వారి స్నేహితుల గురించి అడిగి తెలుసుకోవాలి. పిల్లలకు ఇచ్చే మొబైల్ ఫోన్లు, చూసే కంటెంట్, ఆడే గేమ్‌లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. హింసాత్మక గేమ్‌లకు దూరంగా ఉంచాలి. ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని అందించాలి. కోపాన్ని ఆయుధంగా కాకుండా సానుభూతితో ఎలా పరిష్కరించుకోవాలో పిల్లలకు స్వయంగా చూపించాలి.

ఉపాధ్యాయులు, యాజమాన్యాల బాధ్యత

తరగతి గదులు, మైదానాలు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఉపాధ్యాయులు లేదా ఆయా సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంచాలి. సీసీటీవీల వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రతి పాఠశాలలో అర్హత కలిగిన చైల్డ్ సైకాలజిస్ట్‌ను లేదా కౌన్సెలర్‌ను నియమించాలి. ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, తీవ్ర కోపం చూపే విద్యార్థులను గుర్తించి ముందస్తు కౌన్సిలింగ్ అందించాలి. కేవలం మార్కులు, ర్యాంకుల వెంటే కాకుండా సానుభూతి, ఇతరులను గౌరవించడం, తోటివారి పట్ల దయ కలిగి ఉండటం వంటి మానవీయ విలువలను పాఠ్యాంశాల్లో భాగం చేయాలి.

పిల్లలు కడిగిన ముత్యాల్లాంటివారు. వారు ఏది ఎక్కువగా చూస్తున్నారో అదే, అలాగే చేయాలనుకుంటారు. వారిలో విపరీత ధోరణులు వస్తుండడం సమాజం, కుటుంబం, విద్యా వ్యవస్థల వైఫల్యమే. ఇలాంటి ఘటనలు మనకో తీవ్రమైన హెచ్చరిక. ఇప్పటికైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం పునరాలోచించి.. బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే రేపటి పౌరుల భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్తుందని గుర్తుంచుకోవాలి.

ఇదీ చదవండి: ఈరోజు భారీగా తగ్గిన తులం బంగారం ధర.. ఎంతంటే..

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)