Breaking News

ఆస్కారవిందం

Published on Sat, 10/31/2026 - 05:12

బెంగళూరులో పుట్టి పెరిగిన అనూయస్వామి తన షార్ట్‌ఫిల్మ్‌ ‘పంకజ’ను న్యూయార్క్‌ యూనివర్శిటీ క్లాస్‌రూమ్‌ నుంచి అంతర్జాతీయ ప్రశంసలు అందుకునే, ఆస్కార్‌ బరిలో అర్హత పొందే స్థాయికి తీసుకువెళ్లారు...

న్యూయార్క్‌ యూనివర్శిటీ (ఎన్‌వైయూ)లో ‘పంకజ’ అనే షార్ట్‌ఫిల్మ్‌ కోసం స్క్రిప్ట్‌ రాస్తున్నప్పుడు, భౌగోళికంగా న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం బెంగళూరులో ఉండేవారు అనూయస్వామి. తాను పుట్టి పెరిగిన పరిసరాలు, తల్లితో అనుబంధం...మొదలైన విషయాలు ‘పంకజ’ షార్ట్‌ఫిల్మ్‌కు మూలం అయ్యాయి.

తొలి ఆలోచన
ఇసుక తవ్వే వారి గురించి న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ఒక షో చూసినప్పుడు అనూయస్వామిలో తొలి ఆలోచన మెరిసింది. ఎన్‌వైయూ రెండవ సంవత్సరం పాఠ్యాంశ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ కన్నడ షార్ట్‌ ఫిల్మ్‌ హాలిషార్ట్స్, పామ్‌స్ప్రింగ్స్, రైన్‌డ్యాన్స్‌లాంటి అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకుంది. లండన్‌లోని రైన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వచ్చిన గుర్తింపు ‘పంకజ’ను ఆస్కార్‌ బరిలో నిలవడానికి అర్హత కలిగించింది.

ప్రపంచ దృష్టికి...
లీ చాంగ్‌–డాంగ్, మీరా నాయర్‌లాంటి సినీ దర్శకుల ప్రభావంతో సామాజిక విషయాలకు తన వ్యక్తిగత జ్ఞాపకాలను జోడించారు అనూయస్వామి.
‘నేను బెంగళూరును ఎలా చూశానో, నా చిత్రంలో కూడా అలాగే చూపించాలనుకున్నాను’ అన్నారు. ఆమె దృష్టిలో... ప్రాంతీయ కథలను చెప్పడం అంటే అంతగా తెలియని కథలను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ‘మనం ఎంతగా ప్రాంతీయ అంశాలపై దృష్టిసారిస్తామో అంతగా వైవిధ్యం పెరుగుతుంది’ అంటారు అనూయ.

అమెరికా టు బెంగళూరు
తన షార్ట్‌ఫిల్మ్‌ ఆస్కార్‌కు అర్హత సాధించడం మాట ఎలా ఉన్నా, అవార్డ్‌ల వల్ల అదనపు ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్న ఎదురుగా నిల్చున్నా...‘నేను మొదట చేయాల్సిన పని పంకజ చిత్రాన్ని అమెరికా నుంచి స్వదేశానికి తీసుకురావడం’ అంటున్నారు అనూయస్వామి.‘పంకజ’ లఘుచిత్రాన్ని బెంగళూరు ప్రేక్షకులకు చూపించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ‘నా షార్ట్‌ఫిల్మ్‌ గురించి మన వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటున్నారు. స్వామి ప్రస్తుతం రెండు ఫీచర్‌ ఫిల్మ్‌లపై పనిచేస్తున్నారు. ఒకటి న్యూయార్క్‌లో, మరొకటి బెంగళూరులో చిత్రించాలనుకుంటున్నారు.
 

చివరి నిమిషంలో...
నిజానికి మా నాన్న గురించి సినిమా తీయాలనుకున్నాను. ఆయన జీవితం చాలా గొప్పది. సినిమాకు సరిపోయే జీవితం అది. అయితే నా ప్రాజెక్ట్‌ కోసం తీయడానికి చాలా పెద్దదిగా అనిపించింది. అందుకే చివరి నిమిషంలో నా దారి మార్చుకున్నాను. ఒక సాధారణ స్క్రిప్ట్, అద్భుతమైన నటులు, నాకు బాగా తెలిసిన జీవితాలు, ప్రదేశాలతో ‘పంకజ’ తీశాను. ఈ చిత్రరూపకల్పన ఎన్నో ఇన్‌స్పిరేషన్‌ల సమ్మేళనం.
                                                     
– అనూయస్వామి

Videos

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

ఉప్పాడపై ఉప్పెన.. కొట్టుకుపోయిన బీచ్... వైరల్ అవుతున్న వీడియో

రాప్తాడు సైకో.. రంపంతో విద్యార్థినిపై దాడి అసలు కారణం అదే

రంపం తీసుకుని వస్తుంటే స్కూల్ లో పనోడు అనుకున్నాం.. షాకింగ్ నిజాలు

వేడినీళ్లు తాగు బాబూ.. సూర్యవంశీపై తల్లి ప్రేమ చూడండి!

నెలకు 60,000 ఆదాయం.. SBI అదిరిపోయే స్కీమ్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)