Breaking News

రైతులకు డబ్బులొచ్చాయ్‌.. ‘పీఎం కిసాన్’ విడుదల

Published on Fri, 10/30/2026 - 21:30

దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24వ విడత నిధులు విడుదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (అక్టోబర్ 30) గుజరాత్‌లోని బనస్కాంతలో జరిగిన కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేశారు. మొత్తం 9.34 కోట్లకు పైగా అర్హులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18,690 కోట్లకు పైగా నగదును నేరుగా బదిలీ చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో ఈ సాయం అందించారు.

ఏడాదికి రూ.6,000 సాయం

పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. వ్యవసాయ పెట్టుబడులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలు వంటి అవసరాలకు ఈ సాయం ఉపయోగపడుతుంది. గత జూన్ 20న 23వ విడతగా 9.44 కోట్ల మంది రైతులకు రూ.18,880 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా 24వ విడత విడుదలతో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు అందించిన మొత్తం సాయం రూ.4.64 లక్షల కోట్లు దాటింది.

పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో లేదో ఇలా తెలుసుకోండి..

(How to check PM Kisan status)

  • రైతులు తమ ఖాతాల్లో రూ.2,000 జమ అయ్యాయో లేదో ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈ కింద చెప్పినట్లు చేయండి..

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను (https://pmkisan.gov.in)ను సందర్శించాలి.

  • ఫార్మర్స్ కార్నర్‌లోని 'Know Your Status' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా వివరాలు నమోదు చేయాలి.

  • అవసరమైతే మొబైల్‌కు వచ్చిన ఓటీపీతో ధ్రువీకరణ పూర్తి చేయాలి.

  • అనంతరం చెల్లింపు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, చెల్లింపు తేదీని పరిశీలించవచ్చు.

  • ఇక లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇదే వెబ్‌సైట్‌లోని 'Beneficiary List' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేసి 'Get Report'పై క్లిక్ చేస్తే జాబితాలో పేరును చూసుకోవచ్చు.

  • అయితే పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి. చెల్లింపులు నిలిచిపోకుండా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా, అర్హత వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో రైతులు తనిఖీ చేసుకోవాలి.

ఇదీ చదవండి: జీఎస్టీలో కీలక మార్పులు.. నవంబర్ 1 నుంచి రీఫండ్లకు కొత్త విధానం!
 

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)