Breaking News

40 వేలమంది భద్రతా సిబ్బంది డేటా లీక్‌

Published on Thu, 10/29/2026 - 12:26

యూఎస్‌ఏ అంతర్గత భద్రతా శాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తీవ్రమైన సైబర్‌ భద్రతా వైఫల్యం బయటపడింది. అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ), కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (డీబీపీ) వంటి విభాగాలకు చెందిన దాదాపు 40,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టర్ల గోప్యమైన వ్యక్తిగత రికార్డులు పబ్లిక్‌లోకి విడుదలయ్యాయి.

ప్రముఖ హ్యాకింగ్ డేటా ప్లాట్‌ఫారమ్ డిస్ట్రిబ్యూటెడ్ డెన్యాల్ ఆఫ్ సీక్రెట్స్ ఈ సమాచారాన్ని ‘ఐస్‌పిక్’ పేరిట ఒక డేటాబేస్‌ రూపంలో విడుదల చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ పరిణామం అమెరికా ఫెడరల్ భద్రతా వర్గాల్లో కలవరం రేపుతోంది.

బట్టబయలైన కీలక సమాచారం

ఈ డేటా ఉల్లంఘన కేవలం సాధారణ వివరాలకే పరిమితం కాలేదు. ఫెడరల్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న సిబ్బంది పూర్తి పేర్లు, అధికారిక ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, కార్యాలయాల లొకేషన్లు, ఉద్యోగ హోదాలు, నిర్దిష్ట అసైన్‌మెంట్‌ వివరాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా, సీబీపీ విభాగానికి చెందిన సుమారు 21,000 రికార్డులు, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్‌ఏ) సిబ్బంది సమాచారం ఇందులో ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిఘా వర్గాలు, అండర్‌కవర్ ఆపరేషన్లు, కంప్యూటర్ ఫోరెన్సిక్స్ విభాగాల్లో పనిచేస్తున్న కీలక అధికారుల వివరాలు సైతం లీక్‌ అవ్వడం భద్రతాపరంగా ప్రమాదకర పరిణామంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వలసదారుల బహిష్కరణ నేపథ్యంలో..

అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు ట్రంప్ యంత్రాంగం, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కఠిన చర్యలు చేపడుతున్న తరుణంలో ఈ డేటా లీక్‌ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వలసదారుల బహిష్కరణ ప్రక్రియను ముమ్మరం చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారుల వ్యక్తిగత వివరాలు బయటకు రావడం వారి భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఫెడరల్ ఏజెంట్లను టార్గెట్ చేస్తూ ‘డాక్సింగ్’ దాడులు పెరిగే అవకాశం ఉందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతర్గత భద్రతా విభాగం స్పందన

ఈ ఘటనపై డీహెచ్‌ఎస్‌, సంబంధిత విభాగాలు ఇంకా అధికారికంగా సమగ్ర ప్రకటన విడుదల చేయనప్పటికీ అంతర్గత భద్రతా విభాగం స్పందించింది. సిబ్బంది వివరాలు బహిర్గతం కావడంపై ఇంటెలిజెన్స్ వర్గాలు అంతర్గత దర్యాప్తునకు ఆదేశించాయి. సింగిల్ సైన్-ఆన్ (ఎస్‌ఎస్‌ఓ) సేవలందించే టెక్నాలజీ సంస్థల ద్వారా ఈ భద్రతా లోపం తలెత్తిందా లేక అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

ఇదీ చదవండి: రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్‌కు విద్యుత్‌ నిలిపివేత!

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)