Breaking News

ఇల్లు అమ్మితే వచ్చే లాభాలు.. ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి..

Published on Mon, 10/26/2026 - 11:51

పాత చట్టంలో సెక్షన్లు మీకు పరిచయమే. కొత్త చట్టంలో పొందుపరచిన సెక్షన్లు ఇంకా పరిచయం అయి ఉండవు. సెక్షన్లు మారినా, ముఖఅయమైన అంశాల్లో ఎటువంటి మార్పులు లేవనే చెప్పాలి. ఈ వారం ‘‘ఇల్లు అమ్మగా ఏర్పడే మూలధన లాభాల’’ మీద పన్ను చెల్లించకుండా ఏం చేయాలో తెలుసుకుందాం.  

ఇల్లు అమ్మారు. మూలధన లాభాలు ఏర్పడ్డాయి. సకాలంలో మూలధన లాభాల మీద పన్ను చెల్లించారు. ఇక మీ ఇష్టం. మిగిలిన మొత్తంతో మీరు ఏదైనా చేయొచ్చు. బంగారం కొనడం, వ్యాపారంలో పెట్టుబడి,. కమర్షియల్‌ ప్రాపర్టీ కొనడం, పిల్లల చదువు, ఆడపిల్లల పెళ్లి, అప్పులు తీర్చుకోవడం, కొత్త వ్యాపారం, స్టార్టప్‌లు, విదేశీయానం, ఉన్నత చదువుల నిమిత్తం.. ఇలా మీ ఇష్టం. ఏం చేసినా ఎవరూ ఏమీ అనరు. వాళ్లకి పన్ను ముట్టింది. కొత్తగా కొన్నదానికి ‘పక్కా సోర్స్‌’ ఉంది.

పన్ను చెల్లించకుండా బైటపడాలంటే.. 
పన్ను చెల్లించడానికి ఒకే మార్గం. కానీ పన్ను కట్టకుండా బైటపడాలంటే పలు మార్గాలున్నాయి.

  • ఇల్లు అమ్మిన లాభాలని నిర్దేశించిన కాలవ్యవధి లోపల కొత్త ఇల్లు.. అంటే మరో ఇల్లు (కొత్త కట్టడం కాదు) కొనడం/ఇల్లు కట్టించడం/ఫ్లాట్‌ బుక్‌ చేసుకోవడం.

  • నిర్దేశించిన కాలవ్యవధిలో కొత్త ఇంటి కోసం నిధులు వెచి్చంచకపోతే, రిటర్ను వేసే తేదీకి ఎంత మొత్తం వెచ్చించలేకపోయారో అంత మొత్తం, బ్యాంకులో క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌ 1988లో డిపాజిట్‌ చేయాలి. ఇలా డిపాజిట్‌ చేయడం వల్ల మీరు కొత్త ఇంట్లో ఇన్వెస్ట్‌ చేసినట్లు భావించి పన్ను మినహాయింపు ఇస్తారు.

  • నిర్దేశిత వ్యవధిలో ఇల్లు అమ్మగా ఏర్పడ్డ లాభాలను బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడం.

ఏతావతా చెప్పాలంటే (1) అలాగే (2) ఒకటే.. ఇల్లు కొనడం.. ఇక రెండో ఆప్షన్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడం. ఈ అంశం పరిధిలోకి 
వచ్చే విషయంలో కొన్ని వివరణలు కావాలి. అవేమింటంటే..

» వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది.  
» రెసిడెంట్లకు, నాన్‌ రెసిడెంట్లకు కూడా వర్తిస్తుంది. 
» అయితే, కొత్త ఇల్లు మన దేశంలోనే కొనాలి. విదేశాల్లో కొంటే ఇవ్వరు. 
» నాన్‌ రెసిడెంట్లు బాండ్లను ఎన్‌ఆర్‌వో అకౌంటు నుంచి కొనాలి. 
» నాన్‌ రెసిడెంట్లకు టీడీఎస్‌ రేట్లు ఎక్కువ 
» నాన్‌ రెసిడెంట్లకు ఇండెక్సింగ్‌ ప్రయోజనం లేదు 
» బిల్డింగ్‌ అన్న పదానికి, ఇల్లు అన్న పదానికి భూమితో సహా అని అర్థం. 
» కమర్షియల్‌ ప్రాపర్టీ కాకూడదు. 
» ఆ ఇంటి మీద ఆదాయం ఇన్‌కంట్యాక్స్‌ లెక్కల్లో గతంలో చూపించాలి. అసెస్‌మెంట్‌ అవ్వాలి. అంటే రికార్డుల్లో ఉండాలి. సెల్ఫ్‌ ఆక్యుపైడ్‌ అయినా ఫర్వాలేదు. అద్దెకిచ్చినా ఫర్వాలేదు. 
» ఇల్లు అంటే ఇల్లు, భవంతి, ఫ్లాట్‌ మొదలైనవి 
» కొనడం అంటే కొనడం/ఇల్లు కట్టించడం, ఫ్లాట్‌ కోసం బుక్‌ చేయడం 
» కొనే ఇల్లు రెసిడెన్షియల్‌ అయి ఉండాలి 
» ఇంటి విషయంలో పాత ఇల్లు అమ్మడానికి ఒక సంవత్సరం ముందు, లేదా రెండు సంవత్సరాల తర్వాత గానీ కొనుగోలు చేసి ఉండాలి 
» నిర్మించేదయితే, అమ్మిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోపల నిర్మాణం పూర్తి చేయాలి 
» అలాగే బాండ్ల విషయంలో 6 నెలల్లోగా ఇన్వెస్ట్‌ చేయాలనే కూడా ఉన్నాయి. 
» కొత్త ఇల్లు 3 సంవత్సరాల వరకు అమ్మకూడదు 
» అపార్ట్‌మెంట్లలో, సొసైటీలలో అలాట్‌మెంట్‌ చాలు. పూర్తి కానక్కర్లేదు. స్వా«దీనం అక్కర్లేదు. 
» నిర్దేశించిన గడువు తేదీ లోపల ఇన్వెస్ట్‌ చేస్తే చాలు. పూర్తి కానక్కర్లేదు. 
» ఇన్వెస్ట చేయాల్సిన మొత్తం.. క్యాపిటల్‌ గెయిన్స్‌ మాత్రమే. పాత ఇల్లు అమ్మగా వచి్చన ప్రతిఫలం కాదు.  
» అమ్మగా చేతికొచి్చన ప్రతిఫలంలో నుంచే ఖర్చు పెట్టాలని లేదు. మిగతా ఏ సోర్స్‌ నుంచైనా ఖర్చు పెట్టొచ్చు. 
» కొత్త ఇల్లు మీద రూ. 10 కోట్లు దాటి మినహాయింపు ఇవ్వరు. 
» మినహాయింపు కోసం, కొంత ఇంటి మీద, కొంత బాండ్లలోనూ ఇన్వెస్ట్‌ చేయొచ్చు.  
» కొత్తగా ఇన్వెస్ట్‌ చేసినంత మేరకే మినహాయింపు ఇస్తారు.  
వచ్చే వారం మరికొన్ని ఉదాహరణలు..

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)